గుంటూరు

ఫీజు రీఇంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 29: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబిసి, మైనారిటీ, ఇతర పేద విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్, ఫీజు రీఇంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) డిమాండ్ చేసింది.
అరండల్‌పేటలోని పిడిఎస్‌యు కార్యాలయంలో విద్యార్థులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు గనిరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం విద్యార్థులను విద్యకు దూరంచేసేందుకే బయోమెట్రిక్ విధానాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. స్కాలర్‌షిప్, ఫీజు రీఇంబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకుండా తాత్సారం చేయటం తగదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, హాస్టల్ విద్యార్థులకు మెస్ కాస్మొటిక్ చార్జీలను పెంచి నాలుగేళ్లయిందని, పెరుగుతున్న మార్కెట్ ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీలో జరుగుతున్న అవినీతి అక్రమాలను బహిర్గతం చేయాలని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రమాణాలు పాటించని బోగస్ కాలేజిలను గుర్తింపును రద్దుచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జాన్సీ ఎం ప్రకృతి, నందకిషోర్, ప్రవలిక, గంగ, ఎస్‌కె అన్వర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.