గుంటూరు

ఒబిసి రిజర్వేషన్లలో క్రిమిలేయర్ ఆంక్షను ఎత్తివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 29: కేంద్ర ప్రభుత్వం ఒబిసిలకు కల్పిస్తున్న 25 శాతం రిజర్వేషన్లలో క్రీమీలేయర్ ఆంక్షను పూర్తిగా ఎత్తివేయాలని బిసి సంక్షేమసంఘం రాష్ట్ర కన్వీనర్ కేసన శంకర్‌రావు డిమాండ్ చేశారు. సోమవారం బ్రాడీపేటలోని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రిమిలేయర్ ఆంక్షల కారణంగా ఒబిసిలు రిజర్వేషన్లను పూర్తిగా వినియోగించుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తాజా లెక్కల ప్రకారం 27 శాతంలో కేవలం 12 శాతం స్థానాలు మాత్రమే నిండుతున్నాయని, స్వయాన జాతీయ బిసి కమిషన్ సభ్యులు తెలిపారని వివరించారు. ఈ వ్యత్యాసానికి రూ. 6లక్షలు సంవత్సరాదాయానికి పరిమితిని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించటమే కారణమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బిసిగా చలామణి అవుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ రిజర్వేషన్ కేటగిరీకిలేని క్రిమిలేయర్‌ను బిసి రిజర్వేషన్లకే ఎందుకు వర్తింప చేయాలని నిర్ణయించారో పునః పరిశీలించి ఆంక్షను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బిసి కమిషన్ సూచించిన విధంగా ఆదాయ పరిమితిని రు. 15 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. విలేఖర్ల సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు ఈడె మురళికృష్ణ, నగర అధ్యక్షుడు కన్నా మాస్టారు, కృష్ణబలిజ సంఘం జాతీయ అధ్యక్షుడు అన్నం శివరామయ్య, నాయకులు వి.మధుసూదనరావు, పోతురాజు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.