గుంటూరు

సార్వత్రిక సమ్మెకు సిపిఐ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 30: కార్మిక, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో వచ్చేనెల 2వ తేదీ నుంచి జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కొత్తపేట సిపిఐ కార్యాలయం మల్లయ్యలింగం భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ అస్తిత్వాన్ని, ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక రంగాలను విదేశీ సంస్థలకు, కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యోచిస్తున్నాయని ఆరోపించారు. ఇది కేవలం కార్మికుల హక్కుల సాధన కోసం జరుగుతున్న సమ్మెకాదని, దేశ భద్రతకు, రోజురోజుకు పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా ప్రజలకోసం జరుగుతున్న సమ్మెగా వివరించారు. వామపక్ష, ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న జరిగే సమ్మెలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో భారీ ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏఐటియుసి జిల్లా ప్రధానకార్యదర్శి వెలుగూరి రాధాకృష్ణ మాట్లాడుతూ రక్షణ రంగంలోని నూరుశాతం విదేశీ పెట్టుబడులను ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 11 జాతీయ కార్మిక సంఘాలు, 400కు పైగా స్వతంత్ర సంస్థలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెను కేంద్రం విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెలో నగరంలోని మునిసిపల్, ఆటో కార్మికులు, వాటర్ హాకర్స్, చిరువ్యాపారులు పెద్దసంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో ప్రజానాట్యమండలి జాతీయ కార్యదర్శి పులి సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా ప్రధానకార్యదర్శి ముసునూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.