గుంటూరు

కోర్టులో కౌంటర్ ఫైల్ దాఖలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 30: జూట్‌మిల్లు అక్రమ లాకౌట్ నేపథ్యంలో అందులో పనిచేస్తున్న కార్మికులకు అన్యాయం జరక్కుండా కోర్టులో కౌంటర్‌ఫైల్ దాఖలు చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి కార్మికశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఇన్‌చార్జి కమిషనర్‌తో కలసి వివిధశాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూట్ మిల్లు స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్‌పై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని, దీనిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చూడాలన్నారు. అంతకుముందు పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడుతూ రైల్వేస్టేషన్ నుండి కలెక్టరేట్ రోడ్డు వరకు ట్రాఫిక్‌కు అంతరాయంలేకుండా విస్తరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. బహుళ అంతస్థుల భవనాలకు అగ్నిమాపకశాఖ అనుమతులు ఉన్నాయా లేవా అనే విషయాలను తెలుసుకుని అనుమతులులేని పక్షంలో కేసులు నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాసరావు, ట్రాఫిక్ డిఎస్‌పి కె శ్రీనివాసులు, కార్మికశాఖ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ ఆషారాణి, నగరపాలక సంస్థ సిపి ధనుంజయరెడ్డి, డిసిపి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.