గుంటూరు

సమానత్వం కోసం నడక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదనందిపాడు, ఏప్రిల్ 10: భారతరత్న బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం పెదనందిపాడు పాతబస్టాండ్ సెంటర్ నుండి సమానత్వం కోసం నడకను మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఎన్ బాలకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. మూడు కిలోమీటర్లు పైగా నడక కొనసాగింది. అనంతరం ఎన్ బాలకృష్ణ మాట్లాడుతూ సామాజిక అసమానతలు రూపుమాపడానికి అంబేద్కర్ కృషిచేశారని చెప్పారు. లింగవివక్షతతో పాటు సౌభ్రాతృత్వంతో కూడిన సమసమాజ స్థాపన కోసం ఆయన పనిచేశారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజలు నడవాలని పిలుపునిచ్చారు. ఉత్సవాల కమిటీ చైర్మన్ కె కోటేశ్వరరావు మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాలు, దళితుల సంక్షేమం కోసం అంబేద్కర్ అహర్నిశలు కృషిచేశారని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేదలకు పండ్లు పంపిణీ చేశారు. జి మోహనరావు, జి సుబ్బారావు, టి రమేష్, ఎస్ అంకారావు తదితరులు పాల్గొన్నారు.