గుంటూరు

మృతిచెందిన ఫారెస్ట్ ఉద్యోగి సాజిద్ కుటుంబాన్ని ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాపట్ల, ఏప్రిల్ 10: బొల్లాపల్లిలో దుండగుల చేతిలో హత్యకు గురైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ షేక్ బాజిసాహిద్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బిఎస్‌ఎల్ మిశ్రా అన్నారు. బొల్లాపల్లి మండలంలోని కండ్రిక వద్ద అటవీశాఖలో బీట్ ఆఫీసర్‌గా విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు బీట్ ఆఫీసర్లను దుండగులు కిరాతకంగా నరికి చంపిన ఘటనలో మృతుడు బాజి సాహిద్ బాపట్ల పట్టణంలోని జమేదార్‌పేట వాస్తవ్యుడు కావడంతో, ఆదివారం స్వస్థలానికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. దీంతో ఇక్కడి వాతావరణం శోకసంద్రంగా మారింది. బాపట్లలోనే పాఠశాల, కళాశాల విద్య పూర్తి చేసుకున్న బాజిసాహిద్ మృత్యువార్త స్థానికంగా విషాదాన్ని నింపింది. మృతుని భార్య కరీమూన్, కూతురు ఫక్రున్నీసా, కుమారుడు ఫక్రుద్దీన్‌లను మిశ్రా పరామర్శించి సానుభూతిని తెలిపారు. తక్షణ సాయంగా ప్రభుత్వం రూ.10లక్షలు ప్రకటించిందని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇస్తామని ఈసందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఫారెస్టు సిబ్బందికి విధి నిర్వహణలో ఆయుధాలను మంజూరు చేయాలనే ప్రతిపాదన ఉందని, త్వరలో నిర్ణయం వెలువడుతుందన్నారు. అదనపు పిసిసిపి విపి చౌదరి, టాస్క్ఫోర్స్ డిఐజి కాంతారావు, డిఎఫ్‌ఒ నాగేశ్వరరావు, డిప్యూటి డిఎఫ్‌ఒ సునీత తదితరులు మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.