గుంటూరు

ఘనంగా బక్రీదు ప్రార్థనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), సెప్టెంబర్ 13: త్యాగానికి, నిస్వార్ధ తత్పరతకు, దైవభక్తికి ప్రతీకగా బక్రీదు పండుగను మంగళవారం నగరంలోని ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. సంప్రదాయ వస్త్రాలను ధరించి బాలల నుంచి వృద్ధుల దాకా ప్రధాన ఈద్గాల వద్దకు తరలివెళ్లి ప్రార్థనల్లో పాల్గొన్నారు. పొన్నూరు రోడ్డులోని ఆంధ్రా ముస్లిం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బక్రీదు నమాజ్‌లో అసంఖ్యాకంగా ముస్లింలు పాల్గొన్నారు. నగరంపాలెంలోని ముఖ్య ఈద్గా వద్ద ఏర్పాటుచేసిన నమాజ్‌లో 20 వేలకు మందికి పైగా ముస్లింలు ప్రార్థనలు చేశారు. పరస్పరం ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకుని మిఠాయిలను కూడా పంచుకున్నారు. కాగా పవిత్రమైన బక్రీదు పండుగను పురస్కరించుకుని పేదలకు ముస్లింలు పలు దానాలు చేశారు. వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, జిల్లా మంత్రులు, అధికారులు ముస్లింలకు బక్రీదు శుభాకాంక్షలు తెలియజేశారు.