గుంటూరు

భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన అర్బన్ ఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి, సెప్టెంబర్ 19: జిల్లా అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్టి త్రిపాఠి మండల పరిధిలోని వడ్డేశ్వరంలో సోమవారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈనెల 24, 25, 26 తేదీల్లో తెలుగుదేశంపార్టీ శిక్షణా తరగతులు కెఎల్ వర్శిటీలో జరగనున్న నేపథ్యంలో ఆపార్టీ ఎంపిలు, ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సిలు ఈ శిక్షణా తరగతులకు హాజరుకానున్నందున సదరు ప్రజాప్రతినిదుల భద్రత దృష్ట్యా పోలీసు అధికారులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తున్నారు. తెలుగుదేశంపార్టీ నాయకుల సమావేశ మందిరం, భోజన వసతి, ప్రయాణ మార్గం వంటి ప్రతి అంశాన్ని ఎస్పీ సర్వశ్రేష్టి త్రిపాఠి పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రయాణానికి మార్గం, వాహన పార్కింగ్, ఇతర ఏర్పాట్లపై ఆయన కెఎల్ వర్సిటీ వర్గాల తో చర్చించారు. గుంటూరు నార్త్‌జోన్ డి ఎస్పీ రామాంజనేయులు, మంగళగిరి సిఐ హరికృష్ణ, తాడేపల్లి ఎస్సై వినోద్‌కుమార్, తదితరులు ఈసందర్భంగా అర్బన్ ఎస్పీ వెంట ఉన్నారు.