గుంటూరు

కృష్ణా పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 12: జిల్లాలో ఆగష్టు 12 నుండి 23 వరకు నిర్వహించే కృష్ణా పుష్కరాలను చరిత్రలో నిలిచిపోయే రీతిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. కలెక్టర్ కాంతిలాల్ దండే అధ్యక్షతన మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన పుష్కరాలు, వడ గాలులపై సమీక్షలో ఆయన మాట్లాడారు. గోదావరి పుష్కరాలలో జరిగిన సంఘటన పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పుష్కరఘాట్లు ఉన్న నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను సంప్రదించి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తగిన అంచనాలతో ప్రతిపాదనలు అందజేయాలని మంత్రి చెప్పారు. అనంతరం మీడియాతో పుల్లారావు మాట్లాడుతూ జిల్లాలో కృష్ణా పుష్కరాల అభివృద్ధి పనులకు రూ.485 కోట్లతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు. అందులో తొలివిడతగా రూ.255 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. గోదావరి పుష్కరాలకు దాదాపు 5 కోట్ల మంది భక్తులు, యాత్రికులు విచ్చేశారని, అంతకన్నా ఎక్కువ సంఖ్యలో కృష్ణా పుష్కరాలకు భక్తులు, యాత్రికులు విచ్చేసే అవకాశముందన్నారు. జిల్లాలో పుష్కరఘాట్లలో ప్రధానమైనవిగా అమరావతి, సీతానగరం, పెనుమూడి, సత్రశాలగా గుర్తించినట్లు చెప్పారు. అమరావతి పుష్కరఘాట్‌ను వేయి మీటర్లతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అలాగే సీతానగరం, పెనుమూడి 400 మీటర్లు, సత్రశాల 250 మీటర్లు ఘాట్లను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. నీటిపారుదల శాఖ పరిధిలో 60 ఘాట్ల అభివృద్ధికి రూ.50 కోట్లు, ఎన్ ఎస్‌పి పరిధిలో 6 ఘాట్లకు రూ. 15కోట్లు ప్రతిపాదించడం జరిగిందన్నారు. పంచాయతీరాజ్ పరిధిలో 75 పనులకు రూ.42.26 కోట్లు, ఆర్ అండ్‌బి పరిధిలో 492.2 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి రూ.155.27 కోట్లు ప్రతిపాదించినట్లు తెలిపారు. దేవాదాయశాఖ ద్వారా 176 దేవాలయాల అభివృద్ధికి రూ.12.70 కోట్లు, శాసనసభ్యుల ప్రతిపాదనల మేరకు మరో 162 పనులకు రూ.21.20 కోట్లు ప్రతిపాదించినట్లు చెప్పారు. కొన్ని రోజులుగా జిల్లాలో వీస్తున్న వడగాలులకు ప్రజలు, పిల్లలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. అన్ని ప్రాథమిక, ఉప ఆరోగ్య కేంద్రాలు, వసతిగృహాలు పాఠశాలలు, చలివేంద్రాల వద్ద తగినన్ని ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, తెనాలి శ్రావణ్‌కుమార్, సంయుక్త కలెక్టర్-2 ముంగా వెంకటేశ్వరరావు, డిఆర్‌ఒ కె నాగబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.