గుంటూరు

విద్యార్థి దశ నుంచే సేవాభావంతో ముందుకుసాగండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాటు, సెప్టెంబర్ 27: విద్యార్థి దశ నుంచే సేవాభావంలో ముందుకు సాగాలని జిల్లా యువజన సర్వీసుల సంక్షేమ శాఖ మేనేజర్ పి రామచంద్రరావు సూచించారు. మంగళవారం మండల పరిధిలోని తుమ్మలపాలెంలో గల శ్రీ మిట్టపల్లి ఇంజనీరింగ్ కళాశాలలో రోటరీ వికాస్ గుంటూరు శాఖ ఆధ్వర్యంలో మిట్టపల్లి కళాశాల సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సెమినార్ హాలులో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎవి భాస్కరరావు అధ్యక్షతన విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. సదస్సులో రామచంద్రరావు మాట్లాడుతూ ప్రమాదాలకు గురై అపస్మారక స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలన్నారు. రోటరీ వికాస్ గుంటూరు శాఖ అధ్యక్షుడు టిఎన్ రాజశేఖర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతివిద్యార్థి రక్తదానం చేయవచ్చన్నారు. రక్తదాన శిబిరంలో 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రోటరీ వికాస్ కార్యదర్శి శేషారావు, అసిస్టెంట్ గవర్నర్ ఎవి రమణ, జాయింట్ సెక్రటరి చెన్నయ్య, జిజిహెచ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాయక్, ఎఒ సిహెచ్ శ్రీనివాసరావు, ఎన్‌ఎస్‌ఎస్ కో-ఆర్డినేటర్ బాలకృష్ణరాజు విద్యార్థులు పాల్గొన్నారు.