గుంటూరు

రైతుల్ని ఆదుకొనేందుకు ప్రభుత్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, సెప్టెంబర్ 27: వరదల్లో జరిగిన పంట నష్టాలపై సమగ్ర నివేదికలు అందిన వెంటనే రైతులను ప్రభుత్వం అన్నివిధాల ఆదుకొనేందుకు సిద్ధంగా ఉందని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. మంగళవారం ఆయన ముంపునకు గురైన గ్రామాలను, పంటలను పరిశీలించారు. ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేసేందుకు సిద్ధంగా ఉందని బాధితులకు భరోసానిచ్చారు. పాకాలపాడు, రెంటపాళ్ల, కట్టమూరు, గోరంట్ల, డిడి పాలెం గ్రామల్లో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుమారు 4 వేల ఎకరాల్లో ప్రత్తి, 3 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని అన్నారు. రోడ్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. గృహాలు దెబ్బతిన్న వారి కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. దాదాపు మండలంలో 75 శాతం పంటలు దెబ్బతిన్నాయని, సాగర్ జలాలు పుష్కలంగా ఉన్నాయని, రభీలో పంటలు వేసుకొనే అవకాశం మెండుగా ఉంటుందన్నారు. అనంతరం గోరంట్లలో వరదకు కొట్టుకుపోయి మృతి చెందిన రమేష్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి కృపాదాసు, నియోజకవర్గ యువనేత కోడెల శివరామ్, ఆళ్ళ సాంబయ్య, మొక్కపాటి రామచంద్రరావు, ఎంపిపి బొర్రా కోటేశ్వరరావు, పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కోమటినేని శ్రీనివాసరావు, వందనాదేవి, సత్యనారాయణ, సోలానంబి తదితరులు పాల్గొన్నారు.