గుంటూరు

జిల్లాకు నామినేటెడ్ పదవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 29: ఎన్నో యేళ్లుగా ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ ఎట్టకేలకు ప్రారంభమైంది. తొలివిడత జిల్లాలో కొంతమందికి అవకాశం లభించింది. రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్‌గా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎండి హిదాయత్‌తో పాటు మరికొందరికి నామినేటెడ్ ఛాన్స్ దక్కింది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ కమిటీ, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం కమిటీల్లో కూడా జిల్లాకు ప్రాతినిధ్యం లభించింది. హస్తకళల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా వట్టికూటి హర్షవర్ధన్, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం డైరెక్టర్‌గా ఐ పెంచలయ్య, అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం డైరెక్టర్‌గా రావిపాటి సత్యనారాయణ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా షేక్ లాల్‌వజీర్, కృష్ణ బలిజ పూసల కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్‌పర్సన్‌గా కావటి సామ్రాజ్యం, టాడి టేపర్స్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా తాతా జయప్రకాష్ నారాయణ, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ సభ్యురాలిగా ఎల్ పద్మావతి నియమితులయ్యారు.