గుంటూరు

నిద్రావస్థ నుండి మేల్కోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకుమాను, సెప్టెంబర్ 29: మండల పరిధి గ్రామాల్లో ముంపునకు గురైన పొలాలను గురువారం రాష్ట్ర వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించి, రైతులకు భరోసా ఇచ్చారు. గార్లపాడులో నల్లమడ డ్రైనేజీకి పడిన గండిని పరిశీలించి గండికి ఇప్పటివరకు అధికారులు, ప్రజాప్రతినిధులు కనీసం తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టక తెలుగుదేశం పార్టీ నిద్రావస్థలో ఉందని సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మంత్రులు, శాసనసభ్యులు అసమర్థులన్నారు. రైతులకు కల్లబొల్లి కబుర్లు చెప్పి తెలుగుదేశం పార్టీ కాలయాపన చేస్తోందని, ముంపునకు గురైన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కరవు ప్రాంత రైతులకు వెంటనే పరిహారం అందించి ఆదుకోవాలన్నారు. కొమ్మమూరు కాల్వ, నల్లమడ డ్రైన్ గండ్లను వెంటనే పూడ్చాలన్నారు. రైతులకు భరోసా ఇచ్చేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన కాకుమానులో బైకులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, జిల్లా పార్టీ కన్వీనర్ మర్రి రాజశేఖర్, ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకురాలు మేకతోటి సుచరిత, మండల నాయకులు ఎన్ శివరామకృష్ణ, కోండ్రు అప్పారావు, గేరా పున్నారావు, గార్లపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.