గుంటూరు

యుద్ధ ప్రాతిపదికన రైల్వేట్రాక్ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, సెప్టెంబర్ 29: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరద ముంపునకు గురైన సత్తెనపల్లి-పిడుగురాళ్ళ పట్టణాల మధ్య రైల్వే లైను కిలోమీటర్ మేర కొట్టుకుపోయింది. దీనితో ఈ నెల 22 నుండి రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఉన్నతాధికారులు దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ, మరమ్మతులు చేయిస్తున్నారు. శుక్రవారం నుండి ఈ మార్గంలో రైళ్ళ రాకపోకలను యథావిధిగా కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 5000 మందికి పైగా వివిధ శాఖలకు చెందిన ఇంజనీర్లు, ట్రాక్ మరమ్మతులు చేసేందుకు, కొత్తలైన్ వేసేందుకు నియమించిన రైల్వేకూలీలతో పాటు ప్రైవేటు కూలీలను ఇందుకు వినియోగిస్తున్నారు. ఎప్పటికప్పుడు రైల్వే ఉన్నతాధికారులు ఇక్కడికి చేరుకొని ట్రాక్ పనులను పర్యవేక్షిస్తున్నారు.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ తనిఖీ
ఇదిలాఉండగా గురువారం ట్రాక్ పనులను దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా, డిఆర్‌ఎం విజయ్‌శర్మ తదితర అధికారులు ట్రాక్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 వతేదీ నుండి రైళ్ళ రాకపోకలు జరిగే విధంగా ఇక్కడ మరమ్మతులు పూర్తి కావచ్చాయని తెలిపారు. అనుకున్న సమయానికి ట్రాక్ మరమ్మతులు జరిపిన అధికారులకు, కూలీలకు ఆయన అభినందనలు తెలిపారు.
ఇదిలా వుండగా అక్కడి ట్రాక్ మరమ్మతుల పనుల్లో నిమగ్నమైన వారు మాట్లాడుతూ పూర్తిగా రైళ్ళ రాకపోకలు జరగాలంటే మరో నాలుగు రోజుల సమయమైన పడుతుందని, శుక్రవారానికి రాకపోకలు జరగడం అసంభవమని అంటున్నారు.