గుంటూరు

మిరప చేలను పరిశీలించిన శాస్తవ్రేత్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 30: మండల పరిధిలోని అత్తలూరు, లింగాపురం గ్రామాల్లో జీవా కంపెనీ మిరప విత్తనాలు సాగు చేసి నకిలీగా మారడంతో తీవ్ర నష్టానికి గురవుతున్నామని, అత్తలూరు గ్రామానికి చెందిన మదమంచి ఆదిశేషగిరిరావు, పి రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం మిర్చిశాస్తవ్రేత్త రమణ, రామలింగయ్య, ఎడిఎ సిహెచ్ తిరుమలాదేవి, ఎఒ లావణ్య, ఎంపిఇఒలు మిర్చిపొలాలను పరిశీలించి నమూనాలను సేకరించారు. ఈ పైరు కాపు విషయమై ల్యాబ్ ద్వారా పరిశీలించి నకిలీవో, మంచివో త్వరలో ధ్రువీకరిస్తామని మండల వ్యవసాయ అధికారిణి లావణ్య తెలిపారు. రైతులకు ఎటువంటి నష్టం జరిగినా సంబంధిత కంపెనీలపై తగు చర్యలు తీసుకుంటామని మంగళగిరి ఎడిఎ తిరుమలాదేవి స్పష్టంచేశారు.
లారీ బోల్తా: వ్యక్తికి తీవ్ర గాయాలు
సత్తెనపల్లి, సెప్టెంబర్ 30: పట్టణ పరిధిలోని ఎన్నాదేవి గ్రామం వద్ద ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడడంతో దానిలో ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్ర గాయాల పాలైనాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పిడుగురాళ్ల వైపు నుండి సత్తెనపల్లి వైపు వేగంగా లోడ్‌తో వస్తున్న లారీ అడ్డు వచ్చిన ఆటోను తప్పించబోయి బొల్తా పడింది. ఈ సంఘటనలో లారీలో ప్రయాణిస్తున వ్యక్తికి తీవ్రంగా కాలు చీరుకు పోయింది. హుటాహుటిన అక్కడివారు గాయపడ్డ వ్యక్తిని ద్విచక్ర వాహనంపై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఈ ప్రమాద సమయంలో ధూళిపాళ్ళ ద్విచక్రవాహనంపై వెళుతున్న తాము తృటిలో తప్పించుకున్నామని, లేకుంటే లారీ కింద పడేవాళ్లమని శ్రీనివాస్ విలేఖర్లకు వివరించారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.