గుంటూరు

వైభవంగా ‘నాగార్జున’ వ్యవస్థాపక దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున యూనివర్సిటీ, సెప్టెంబర్ 30: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 39, 40వ వ్యవస్థాపక దినోత్సవాల వేడుకలు శుక్రవారం వర్సిటీలోని డైక్‌మెన్ ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా జరిగాయి. మధ్యాహ్నం 2 గంటలకు డైక్‌మెన్ ఆడిటోరియంలో వర్సిటీ వీసీ ఆచార్య ఎ రాజేంద్రప్రసాద్ ఈ ఉత్సవాలను ప్రారంభించారు. సమాజంలో వివిధ రంగాలలో ఎనలేని కృషి చేసిన 22 మంది ప్రముఖులకు ప్రతిభాపురస్కారాలను వీసీ వారికి అందచేశారు. పురస్కారం కింద 5వేల రూపాయల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందచేశారు. వీటితోపాటు వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విభాగాలకు, కళాశాలకు ప్రత్యేక బహుమతులు అందచేశారు. 2014-15 విద్యాసంవత్సరానికి గాను ఉత్తమ కళాశాలల విభాగంలో గుంటూరు అభ్యుదయ మహిళా కళాశాల, వర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల, బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలు ప్రథమస్థానం కైవసం చేసుకోగా, ఒంగోలు ఎస్‌ఎస్‌ఎన్ కళాశాల, వర్సిటీ సైన్స్ కళాశాల, ఆర్‌విఆర్ అండ్ జెసి కళాశాలలు ద్వితీయస్థానాలు కైవసం చేసుకున్నాయి. 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించి ఉత్తమ కళాశాలల విభాగంలో ఒంగోలు ఎస్‌ఎస్‌ఎన్ కళాశాల, వర్సిటీ సైన్స్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, ఆర్‌విఆర్ అండ్ జెసి కళాశాలలు ప్రథమ బహుమతిని గెలుచుకోగా, గుంటూరు అభ్యుదయ కళాశాల, వర్సిటీ ఆర్ట్స్ కళాశాల, గుంటూరులోని క్రీస్తుజయంతి కళాశాలలు ద్వితీయ బహుమతులు కైవసం చేసుకున్నాయి. ఉత్తమ గ్రంథాలయ నిర్వహణ విభాగంలో చలపతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ కళాశాల, గుంటూరులోని ప్రభుత్వ మహిళా కళాశాలలు ప్రథమ బహుమతులు కైవసం చేసుకోగా, నగరం ఎస్‌విఆర్‌ఎం కళాశాల, ఆర్‌విఆర్ అండ్ జెసి కళాశాలలు ద్వితీయ బహుమతులు కైవసం చేసుకున్నాయి. ఉత్తమ ల్యాబొరేటరీ విభాగంలో నగరం ఎస్‌విఆర్‌ఎం కళాశాల, గుంటూరులోని ఆర్‌విఆర్ అండ్ జెసి ఇంజనీరింగ్ కళాశాల ప్రధమ బహుమతులు, తెనాలి జెఎంజె మహిళా కళాశాల , శామ్యూల్ జార్జ్ ఫార్మాస్యూటికల్ కళాశాల ద్వితీయ బహుమతులు గెలుచుకున్నాయి. అంతర్జాతీయ జర్నల్స్‌లో ఉత్తమ పరిశోధనాపత్రాలను సమర్పించినందుకుగాను వర్సిటీలోని ఇంగ్లీషు విభాగానికి చెందిన డాక్టర్ జి చెన్నారెడ్డి, ఆచార్య కెవిరావు, ఆచార్య నూర్‌బాషా అబ్దుల్, ఆచార్య కె రత్నషీలామణి పురస్కారాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య కెఆర్‌ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య కె జాన్‌పాల్, వర్సిటీ పాలకమండలి సభ్యులు ఆచార్య ఎం కోటేశ్వరరావు, ఆచార్య కోడెల వెంకట్రావు, వర్సిటీ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఆచార్య బి విక్టర్‌బాబు, ఆచార్య విజయరాజు తదితరులు పాల్గొన్నారు.