గుంటూరు

కార్మికుల హక్కులను హరిస్తే ఉద్యమిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్నూరు, అక్టోబర్ 23: రేయింబవళ్లు కష్టించి పనిచేసే భవన నిర్మాణ కార్మికులకు 60 యేళ్ల వయస్సు వచ్చిన అనంతరం అతని పేరును సంక్షేమ బోర్డు నుంచి తొలగించడం అన్యాయమని, బోర్డు సభ్యునిగా అతన్ని కొనసాగించాలని పొన్నూరు పట్టణ సెంట్రింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కలువకొల్లు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పొన్నూరులోని ఎఐటియుసి కార్యాలయంలో ఆదివారం జరిగిన సెంట్రింగ్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. సమావేశంలో పాల్గొన్న ఎఐటియుసి పొన్నూరు నియోజకవర్గ అధ్యక్షుడు ఆరేటి రామారావు మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మికుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తున్నాయని, చట్టాలను సవరించి యూనియన్ పెట్టుకునేందుకు వీలుపడని పరిస్థితులను కల్పిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా తమ హక్కుల సాధనకై పోరాటం చేయాలని కార్మికవర్గాలకు రామారావు పిలుపునిచ్చారు. సంఘ నేత ఏడుకొండలు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎఐటియుసి నేతలు జాకీర్‌హుస్సేన్, కోటయ్య, అంజిరెడ్డి, సూరిబాబు, శేషు, సుబ్బారావు, రహీం, పగడాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.