గుంటూరు

వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), అక్టోబర్ 23: దాక్షిణ్య హాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యాన గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ టివి రావు కోరారు. ఆదివారం గుంటూరు రూరల్ జొన్నలగడ్డ గ్రామంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. సీజనల్ వ్యాధుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, వైద్యులు అందించే సలహాలు, సూచనలు పాటించాలన్నారు. డాక్టన్ చెన్నంశెట్టి కావ్య మాట్లాడుతూ చర్మవ్యాధులను ముఖ్యంగా స్పర్శజ్ఞానం తక్కువగా ఉన్న మచ్చలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలని సూచించారు. మోకాలినొప్పులు, మెడ, నడుము, వెన్ను నొప్పులకు వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడుతూ ఫిజియోథెరపిస్ట్ సూచనలు, సలహాలు పాటించాలని డాక్టర్ మద్దె వినోద్‌కుమార్ అన్నారు. జనరల్ ఫిజీషియన్ డాక్టర్ జి స్వప్న రక్తపోటు, షుగర్ బాధితులు క్రమం తప్పకుండా వ్యాయామం, మందులు వాడాలన్నారు. కార్యక్రమంలో జనరల్ సర్జన్ డాక్టర్ బి కిషోర్, పిజియోథెరపిస్ట్ బాల బ్రహ్మాచారి, దాక్షిణ్య సంస్థ జనరల్ సెక్రటరి ఆర్ వెంకయ్యనాయుడు, జాయింట్ సెక్రటరి అశోక్, చర్మవ్యాధుల వైద్యులు కావ్య, వినోద్, స్వప్న, కిషోర్, ఉప సర్పంచ్ శ్రీనివాసరావు, శ్రీనివాసరావు, మొబైల్ సిబ్బంది పాల్గొన్నారు.