గుంటూరు

మావోయిస్టుల ఎన్‌కౌంటర్ దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (లీగల్), అక్టోబర్ 25: చట్టాలను అమలు చేయాల్సిన ప్రభుత్వం, పోలీసులే చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తూ పౌరహక్కులను కాలరాస్తున్నారని, మావోయిస్టులను చుట్టుముట్టి బంధించి, శిక్షించాలేగాని ఎన్‌కౌంటర్‌పేరుతో ప్రాణాలు హరించే హక్కులేదని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు), ఏపి పౌరహక్కుల సంఘం (ఎపిసిఎల్‌ఎ) రాష్ట్ర కమిటీలు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌పై పోలీసులను నిందితులుగా చేర్చి కేసులు నమోదు చేసి విచారణ జరిపించాలని సంఘాలు డిమాండ్ చేశాయి. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు ఎన్‌కౌంటర్లపై కేసులు నమోదుచేసి వాస్తవాలను నమోదుచేయాలని తీర్పులను వెలువరించినట్లు గుర్తుచేశారు. చట్టాల ఉల్లంఘనతోపాటు ఎన్‌కౌంటర్ల ముద్ర వేయడం ఏమిటంటూ ఐలు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సుంకర రాజేంద్రప్రసాద్, నర్రా శ్రీనివాసరావు, ఏపిసిఎల్‌ఎ నాయకులు జి శేషగిరిరావు, రామకృష్ణ, జిల్లా ఐలు అధ్యక్ష, కార్యదర్శులు బి సలీం, ఇళ్ల మధుబాబు ప్రశ్నించారు.