గుంటూరు

త్రిబుల్ తలాక్ పద్ధతిలో జోక్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్నూరు, నవంబర్ 4: ముస్లిం పర్సనల్ లాలో ప్రభుత్వాల జోక్యం తగదని, త్రిబుల్ తలాక్ విధానం విషయంలో జోక్యం చేసుకుని ముస్లింల మనోభావాలను దెబ్బతీయవద్దని కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ స్థానికంగా శుక్రవారం ముస్లింలు ర్యాలీ జరిపారు. కేంద్రప్రభుత్వ కామన్ సివిల్ కోడ్ విధానానికి వ్యతిరేకంగా జరిగిన ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ముస్లింలు, ఉలేమాలు, ముతవల్లిలు పాల్గొన్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపునకు మద్దతుగా ముస్లిం సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జరిపిన ర్యాలీ పట్టణ కూడలియైన ట్రాఫిక్ ఐలాండ్ సెంటర్ నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నయింబాషా, మొల్లా కరీమ్, కరిముల్లా, వాహెదుల్లా, తజ్ముల్‌బేగ్, షేక్ అంజాద్, జిలాని, ఎస్‌కె జాని, మునీర్ తదితరులు పాల్గొన్నారు. తహశీల్దార్ రమణానాయక్‌కు వినతిపత్రం అందజేశారు.