గుంటూరు

భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు పదేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (లీగల్), నవంబర్ 4: వివాహేతర సంబంధం కొనసాగించడమే కాకుండా, అదనపుకట్నం తెస్తేనే కాపురం చేస్తానంటూ కట్టుకున్న భార్యనే కడతేర్చేందుకు ప్రయత్నించిన భర్తకు పదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ గుంటూరు 4వ అదనపు అసిస్టెంట్ సెషన్స్ న్యాయమూర్తి పి కమలదేవి శుక్రవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... సంఘటనకు ఏడేళ్ల క్రితం స్థానిక కెవిపి కాలనీకి చెందిన గుంజి రాజేష్‌కు కృష్ణాజిల్లా వీర్లపాడు గ్రామానికి చెందిన వసంతతో వివాహమైంది. 50 వేలు కట్నంగా రాజేష్ తీసుకున్నాడు. ఇద్దరు సంతానం కలిగాక రాజేష్ అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ భార్యను అదనపు కట్నం కోసం వేధించసాగాడు. పలుమార్లు లాలాపేట పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపినప్పటికీ పద్ధతిలో మార్పురాలేదు. 2014 జూన్ 4వ తేదీన మధ్యాహ్నం మద్యం సేవించి వచ్చిన రాజేష్ భార్య వసంతతో గొడవపడి బండరాయితో ఆమె తలపై మోదాడు. అడ్డువచ్చిన చిన్న పిల్లలపై కూడా దాడికి దిగి గాయపర్చాడు. చుట్టుపక్కల వారు వారిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లాలాపేట సిఐ సిహెచ్ శ్రీనివాసరావు నిందితుడు రాజేష్‌ను అరెస్ట్‌చేసి చార్జిషీటు దాఖలు చేశారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వైఎస్ పుష్ప నిందితుడు రాజేష్‌పై నేరం రుజువు చేయడంతో పదేళ్ల జైలుశిక్షతో పాటు 2 వేల రూపాయల జరిమానా కూడా విధిస్తూ న్యాయమూర్తి కమలదేవి తీర్పుచెప్పారు.