గుంటూరు

అవినీతి వల్ల మిగిలేది ఆవేదన, విషాదమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), నవంబర్ 4: అవినీతి అనేది రుగ్మత వంటిదని, చివరకు అది అంతులేని ఆవేదనను, విషాదాన్ని మిగులుస్తుందని సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ టాక్స్ గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల కమిషనర్ జెఎస్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక కన్నావారితోటలోని కేంద్ర ఎక్సైజ్ ప్రధాన కార్యాలయంలో నిజాయితీ పెంపుదల, అవినీతి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అనే అంశంపై ఉద్యోగులు, విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు జరిగాయి. బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కమిషనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ అవినీతి దేశ ఆర్థికాభివృద్ధికి తీవ్ర విఘాతం కల్గిస్తుందన్నారు. అవినీతిపై యువత యుద్ధం ప్రకటించాలన్నారు. అవినీతికి వ్యతిరేకంగా సిలబస్‌ను తయారు చేసి పాఠ్యాంశంగా విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ నాగేంద్రరావు మాట్లాడుతూ ప్రభుత్వ సర్వీసులో అవినీతిని నిర్మూలించేందుకు సామాజిక భద్రత గురించి అందరికీ తెలియజేయడమే తమ లక్ష్యమన్నారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు దీనాశర్మ, ఆషారాధ, సాయిసింధూరి, కళ్యాణి, లతలతో పాటు ఉద్యోగులు ఆషా, మాధవీలత, కె రామకృష్ణలకు బహుమతులు, సర్ట్ఫిక్టెలను కమిషనర్ ఆందజేశారు. విజిలెన్స్ సూపరింటెండెంట్ ఎస్ రాజ్యలక్ష్మి పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ వై శ్రీనివాసరావు, ఇన్స్‌పెక్టర్లు సిహెచ్ వెంకటేశ్వరరావు, ఈశ్వర్, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.