గుంటూరు

కాపుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 18: కాపుల సంక్షేమమే రాష్ట్రప్రభుత్వ ధ్యేయమని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ పేర్కొన్నారు. సోమవారం స్థానిక వెంకటేశ్వరా విజ్ఞాన మందిరంలో రాష్ట్ర కాపుసంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వ్యక్తిగత రుణాలపై అవగాహన సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన రామానుజయ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం ఎప్పుడూ విడుదల చేయని విధంగా టిడిపి ప్రభుత్వం కాపుల సంక్షేమానికి 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందన్నారు. న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి జిల్లాలో కాపు సంక్షేమ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గత 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు తప్ప అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు. ఎన్నికల ముందు పేర్కొన్న విధంగా కాపులకు అన్నిరకాల ప్రయోజనాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. కాపుల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రతినిధులు పాటు పడుతున్నారన్నారు. గతంలో 2013 సంవత్సరంలో అప్పటి కేంద్రప్రభుత్వం కొన్ని సామాజికవర్గాలను బిసిల్లో చేరుస్తూ ఆర్డినెన్స్ జారీచేస్తే ఆ ఆర్డినెన్స్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిందన్నారు. బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలంటే బిసి కమిషన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు విధివిధానాలను కూడా సుప్రీంకోర్టు జారీచేసిందన్నారు. గతంలో జీవో 13ను విడుదల చేశారని, ఈ జీవోనే మరలా విడుదల చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయనే ప్రభుత్వం జస్టిస్ మంజునాథ కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. కమిషన్ 9 నెలల కాలంలో తన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుందన్నారు. ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్, పాలకొల్లు ఎమ్మెల్యే రాజానాయుడు, మాజీ మంత్రి శనక్కాయల అరుణ, కాపు నేతలు దాసరి రాజామాస్టారు, డాక్టర్ టివి రావు, చందు సాంబశివరావు, ఇక్కుర్తి సాంబశివరావు, దాసరి రాము మాట్లాడుతూ 1966 సంవత్సరంలో అప్పటి రాష్ట్రప్రభుత్వం కాపులకు బిసి రిజర్వేషన్‌ను తొలగించిందన్నారు. ఈ 50 సంవత్సరాల కాలంలో కాపులు ఆర్థికంగా బిసిల కంటే వెనుకబడి ఉన్నారన్నారు. బిసిలు, ఎస్సీలకు మాదిరిగానే ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కాపులకు స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. 13 జిల్లాల్లో సదస్సులు నిర్వహించి సదస్సుల్లో వచ్చిన సలహాలను కాపుల అభివృద్ధికి ఎలా వినియోగించాలనే అంశాలను ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. గతంలో చంద్రబాబు పాదయాత్ర చేపట్టినప్పుడు కాపుల బాదలను చూసి చలించి వారికి రిజర్వేషన్ కల్పించాలని ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చారన్నారు. సమావేశంలో కాపు నాయకులు డేగల ప్రభాకర్, బొక్కిసం శివరామ్, మేకల బాబురావు, యర్రపోగు నాగేశ్వరరావు, అడపా బాబు, సుంకర సతీష్‌కుమార్, గుంటూరు రూరల్ ఎంపిపి సీతామహాలక్ష్మి, పోతురాజు ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.