గుంటూరు

హోదా ధర్నాకు తరలిరండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 9: ప్రత్యేక హోదాను కాంక్షిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు కలెక్టరేట్ ఎదుట మంగళవారం తలపెట్టిన మహాధర్నాకు జిల్లా నలుమూలల నుంచి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని వైసిపి జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నాకు సంబంధించిన ఏర్పాట్లను నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేకహోదా తప్పనిసరని, అది మన హక్కు అని పేర్కొన్నారు. మహాధర్నా ద్వారా మన నిరసనను, హోదా ఆవశ్యకతను ఢిల్లీ పెద్దలకు తెలియజెప్పేలా తరలిరావాలన్నారు. ధర్నాకు ఎమ్మెల్యేలతో పాటు జెడ్పీటీసీలు, ఎంపిపిలు, ఆయా విభాగాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు సభ్యులు హాజరుకావాలని కోరారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కావటి మనోహర్ నాయుడు, సేవాదళ్ అధ్యక్షుడు కొత్త చిన్నపరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య తదితరులున్నారు.

కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి
* దాచేపల్లిలో హోంమంత్రి సుడిగాలి పర్యటన
దాచేపల్లి, మే 9: రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోమవారం దాచేపల్లిలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. దాచేపల్లి హైవే పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్ర డిజిటల్ కేబుల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన మంత్రి అనంతరం 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న దాచేపల్లి-తంగెడ 15 కిలోమీటర్ల రహదారికి శంకుస్థాపన చేశారు. అనంతరం ముత్యాలంపాడు రోడ్డులో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశారు. నీరు-మట్టి కార్యక్రమంలో భాగంగా ఇంకుడుగుంట, సేద్యపు కుంటను హోం మంత్రి తవ్వారు. ఈ సందర్భంగా హోం మంత్రి ప్రసంగిస్తూ పల్నాడు ప్రాంతంలో నూతన కేబుల్ నెటవర్క్ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలైన సమాచారాన్ని అందించాలని ఆయన కేబుల్ నెట్‌వర్క్ నిర్వాహకులకు సూచించారు. గురజాల ఎమ్మేల్యే యరపతినేని శ్రీనివాస రావు ప్రసంగిస్తూ అత్యాధునిక టెక్నాలజితో పల్నాడు ప్రాంతం అంతా విస్తరించే విధంగా దాచేపల్లిలో కేబుల్ నెట్‌వర్క్ ను ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. అనంతరం హోం మంత్రి దాచేపల్లి మార్కెట్‌యార్డులో వివిధ శాఖల అధికారులతో కరవుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని కరవురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకుడుగుంటలు, సేద్యపు కుంటల ఉద్యమాన్ని చంద్రబాబు ప్రారంభించారని హోంమంత్రి చెప్పారు. గురజాల నియోజకవర్గంలో అత్యధికంగా ఇంకుడుగుంటలు, సేద్యపు కుంటలు నిర్మాణం కావటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజీనేయులు, తెలుగుదేశం శాసన సభ్యులు పయ్యావులు కేశవ్, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

కూలిన నవయుగ హోటల్ భవనం
* ఒకరికి గాయాలు, త్రుటిలో తప్పించుకున్న ఇద్దరు * నోటీసులు ఇచ్చామంటున్న మున్సిపల్ అధికారులు
* సంఘటన స్థలాన్ని పరిశీలించిన కమిషనర్, డిఎస్పీ
తెనాలి, మే 9: ఆంధ్రాప్యారిస్‌గా పేరుగాంచిన తెనాలిలో 54 ఏళ్ళ నాటి చరిత్ర కలిగిన నవయుగ హోటల్ సోమవారం ఉదయం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరు వృద్ధులు తృటిలో తప్పించుకోగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న మున్సిపల్ అధికారులు భవనం కూల్చేందుకు ముందుగానే నోటీసులు ఇచ్చామంటుండగా, ఇంజనీర్ల సలహాలతో భవనాన్ని తక్షణమే పడవేయాలని డిఎస్పీ రమణమూర్తి హోటల్ యజమానులను ఆదేశించారు. తెనాలి పట్టణం బోస్‌రోడ్‌లోని వీనస్ సినిమాహాలు ఎదురుగాఉన్న ఈ హోటల్‌లో తెనాలి వచ్చిన ఎవరైనా టిఫిన్, భోజనం చేయకుండా వెళ్ళరంటే ఆశ్చర్యంకాదు. అయితే ఇటీవల కాలంలో వినియోగదారుల రద్దీ తగింది. హోటల్ భవనం పెచ్చులూడి శిథిలావస్థకు చేరింది. మున్సిపల్ అధికారులు హోటల్ భవనాన్ని పడవేయాలంటూ గత నెలలో నోటీలు జారీ చేశారు. ఈ హోటల్‌తోపాటుగా మరో 67 పురాతన భవనాలను కూల్చివేయాలంటూ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు టౌన్‌ప్లానింగ్ అధికారి అశోక్‌కుమార్ తెలిపారు. అయితే హోటల్ ఆస్తులుపై అన్నదమ్ముల మధ్య తగాదాలతో కోర్డుకెళ్ళారు. కోర్టు ఇద్దరికీ సమానభాగం ఇవ్వాలని 2014 లోనే తీర్పునిచ్చినట్లు హోటల్ యజమాని ఆరెమండ శివన్నారాయణ అలియాస్ చిన్నబ్బాయి తెలిపారు. అదేహోటల్ భవనంలోఉన్న పుస్తకాల దుకాణం యజమాని ఖాళీ చేయకపోవటంతో భవనం పడవేయటం ఆలస్యమైనట్లు చిన్నబ్బాయి చెబుతున్నారు. అయినప్పటికీ కొద్దికొద్దిగా పడవేసేందుకు సోమవారం పను లు చేపట్టిన క్రమంలో భవనం ముం దుభాగం కూలిపోయినట్లు చెప్పారు. కాగా భవనం కూలిపోయిన సమయం లో కూలీలు పైభాగంలో పనిచేస్తుండటం పెద్ద ప్రమాదమే తప్పింది. అదేసమయంలో భవంగా ముందు ఖాళీభాగంలో పండ్లు అమ్ముకునే ఓమహిళ, మరోవృద్ధుడు, పక్క హోటల్‌లో పనిచేసే వ్యక్తి కూర్చున్నారు. ఇద్దరు వృద్ధులు ప్రమాదం నుండి క్షణంలో తప్పించుకోగా ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. తెనాలి డిఎస్పీ రమణమూర్తి, సిఐ బి శ్రీనివాసరావు, కమిషనర్ శకుంతల, టిపిఓ అశోక్‌కుమార్‌ను హోటల్ వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. యజమానిని పిలిపించి త్వరిగతిన భవనాన్ని కూల్చాలన్నారు. ఈక్రమంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరిగినా సహించేది లేదని హెచ్చరించా రు. హోటల్ ముందు ఎటువంటి వా హనాలు నడువకుండా బ్యారికేట్స్ ఏ ర్పాటు చేశారు. ఇదిలాఉండగా కూలిన భవనం పక్కనే ఐఓబి ఉండటంతో వినియోగదారులు పరుగులు తీశారు.

ఇళ్లపట్టాల కోసం నవులూరు పేదల ధర్నా
మంగళగిరి, మే 9: ఎన్నో ఏళ్లుగా తాము నివాసాలు ఏర్పరచుకుని జీవనం సాగిస్తున్న తమ నివాసాలకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మండల పరిధిలోని నవులూరు గ్రామస్తులు సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తొలుత నవులూరుకు చెందిన పేదప్రజలు అంబేద్కర్ విగ్రహం సెంటర్‌కు చేరుకుని అక్కడి నుంచి ప్రదర్శనగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని తమ డిమాండ్లతో కూడిన ప్లేకార్డులను చేతబూని నినాదాలు చేశారు. ఇళ్ల పట్టాలివ్వాలని, పేదల కాలనీలో వసతులు మెరుగు పరచాలని నినదించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ ఎస్ విజయలక్ష్మికి అందజేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీ్ధర్‌తోను సిపిఎం నేతలు ఎం రవి, వై గంగాధరరావు మాట్లాడారు. పేదల ఇళ్లు తొలగించే ప్రతిపాదన విరమించుకుని అర్హులందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.