గుంటూరు

మిగులు జలాల హక్కు కోల్పోయంది వైఎస్ వల్లే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), మే 16: మిగులు జలాల హక్కులను కోరబోమని బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి లిఖితపూర్వకంగా లేఖ రాశారని, దాని కారణంగానే నేడు నీటి హక్కులను కోల్పోవాల్సి వచ్చిందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులు పేర్కొన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులకు వైఎస్ అనుమతులిస్తే కిరణ్‌కుమార్ రెడ్డి నిధులు కేటాయించారని, పాలమూరుకు అనుమతులు ఇచ్చినప్పుడు జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. తండ్రిచేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే నేడు దీక్షల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. జలయజ్ఞంతో 40 వేల కోట్లు ఖర్చుపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క ఎకరానికి కూడా నీరు విడుదల చేయలేదని, జగన్ అవినీతి అక్రమాల కోసమే ఆ ప్రాజెక్టులు కట్టారని ఆరోపించారు. పాలమూరు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు కాంట్రాక్టు పనులను జగన్మోహనరెడ్డి తన పార్టీ ఎంపి మిధున్‌రెడ్డికి ఇప్పించి టిఆర్‌ఎస్ పార్టీలోకి పంపించారన్నారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో తిరుపతిలో జరగనున్న మహానాడు సందర్భంగా జిల్లాలో 18,19,20 తేదీల్లో నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించి, 22న జిల్లా మహానాడును నిర్వహించనున్నట్లు జివి తెలిపారు. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ జగన్ దీక్షల వలన రాష్ట్రానికి ప్రయోజనం కంటే నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. జలవివాదాలు ఏర్పడినప్పుడు కేంద్రం, ట్రిబ్యునల్ ముందుకు తీసుకెళ్లి పరిష్కరించుకోవాలే గానీ దీక్షల పేరుతో ప్రజలను రెచ్చగొడితే ఉపయోగం లేదన్నారు. బిజెపి నేతలు ప్రత్యేకహోదాతో పాటు కృష్ణాజలాల వివాదాన్ని కూడా దేశ ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కేంద్రం, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ విషయంపై చర్చించుకున్న తరువాత ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలన్నారు. ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ మాట్లాడుతూ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘాన్ని స్థాపించి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పార్టీపరంగా తమవంతు కృషిచేస్తున్నామన్నారు. సంఘ జిల్లా సదస్సును మంగళవారం హిందూ కళాశాలలోని ఏకాదండయ్య పంతులు హాలులో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ అవినీతి సామ్రాట్ బొత్స సత్యనారాయణకు చంద్రబాబును విమర్శించే నైతిక హక్కులేదన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాసయాదవ్, రాయపాటి శ్రీనివాసరావు, జియావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

కరాటేలో హసీనాకు స్వర్ణం
మంగళగిరి, మే 16: అంతర్జాతీయ కరాటే పోటీల్లో మంగళగిరిలోని విజె డిగ్రీ కళాశాలలో బిఎస్పీ ప్రథమ సంవత్సరం చదువుతున్న షేక్ హసీనా ప్రతిభ కనబర్చి కటా, కుముటి విభాగాల్లో రెండు బంగారు పతకాలు కైవసం చేసుకుందని కాలేజీ ప్రిన్సిపాల్ ఎం శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. ఈనెల 14, 15వ తేదీలలో భారత్, శ్రీలంకల మధ్య జరిగిన కాన్షికై బొజర్యు కరాటే చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొన్న హసీనా ఈ పతకాలు కైవసం చేసుకుందని కళాశాల కరస్పాండెంట్ ప్రగడ రాజశేఖర్ అభినందించారు. నిర్భయలాంటి చట్టాలు ఉన్నప్పటికీ ఆడపిల్లలపై జరిగే దాడులు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కరాటేలాంటి విద్య నేర్చుకోవడం సరైన మార్గమన్నారు. కోచ్‌గా ప్రభాకర్ వ్యవహరించారు.