గుంటూరు

బీసీల అభ్యున్నతి కోసం రాజకీయాల్లోకి వస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినుకొండ, మే 16: రాష్ట్రంలోని బీసీల అభ్యున్నతి కోసం తాను రాజకీయాల్లోకి వస్తానని సినీ నటుడు సుమన్ అన్నారు. పట్టణంలో సోమవారం జరిగిన హోమాల కార్యక్రమాలకు విశిష్ట అతిథిగా వచ్చిన సుమన్ విలేఖరులతో మాట్లాడారు. బీసీ కులాలు ఐకమత్యంతో మెలిగి హక్కులను సాధించుకోవాలన్నారు. భవిష్యత్‌లో అప్పటి పరిస్థితుల నేపథ్యంలో తాను ఏ రాజకీయ పార్టీ నుంచైనా రాజకీయాల్లోకి రావచ్చన్నారు. సమాజంలో బీసీలకు రక్షణ కరవైందని, వృత్తి పేర్లతో అపహాస్యం చేస్తూ కించపరుస్తూ అభాసుపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకుప్రభుత్వం రక్షణ కల్పిస్తూ ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని అన్నారు. బీసీలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, రిజర్వేషన్ల శాతాన్ని పెంచి ఆదుకోవాలన్నారు. రాష్ట్రీయ భేదం లేకుండా దేశవ్యాప్తంగా బీసీ కులాలను బీసీలుగానే గుర్తించాలన్నారు. రాష్ట్రం మారితే కొన్ని రాష్ట్రాల్లో బీసీలను ఓసీలుగా గుర్తిస్తున్నారని అన్నారు. దీంతో ఆయా బీసీ కులాలు తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు.ఈ సమావేశంలో బీసీ నాయకులు కేసన శంకరరావు, స్థానిక నాయకులు డాక్టర్ పీవీ చలపతిరావు, డాక్టర్ సాంబశివరావు, శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.