గుంటూరు

24న ప్రభుత్వ ఇఫ్తార్ విందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 21: ఉపవాస దీక్షలు పాటించే ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 24వ తేదీన ఇఫ్తార్ విందు గుంటూరు నగరంలో ఏర్పాటు చేస్తుందని, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నట్లు కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులతో ఆయన సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక సన్నిధి కల్యాణ మండపంలో 24వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే నమాజ్, ఇఫ్తార్ విందు కార్యక్రమాలతో పాటు మత పెద్దలతో కూడా సిఎం సమావేశం కానున్నారన్నారు. కార్యక్రమంలో ఇతర జిల్లాల నుండి కూడా సుమారు 2 వేల మంది హాజరు కానున్నట్లు తెలిపారు. బారికేడింగ్, పార్కింగ్ ఏర్పాట్లతో పాటు మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున సంపూర్ణ పారిశుద్ధ్యాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. 25వ తేదీ ఉదయం 9.30 గంటలకు సిఎం తుళ్లూరు రానున్నారని, అక్కడ ఆరు వరసల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు. అదేవిధంగా ఎన్‌టిఆర్ క్యాంటిన్‌ను ప్రారంభించిన అనంతరం రైతులకు ప్లాట్లు పంపిణీ చేస్తారన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జెసి చెరుకూరి శ్రీ్ధర్, గుంటూరు ఆర్డీవో శ్రీనివాసరావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

హిమామి సిమెంట్స్ మైనింగ్ ప్రాజెక్ట్‌పై ప్రజాభిప్రాయ సేకరణ సభ
దాచేపల్లి , జూన్ 21 : దాచేపల్లి మండలంలోని తంగెడ, మాదినపాడు, సారంగపల్లి అగ్రహారం, కొత్తూరు గ్రామాల పరిధిలో నిర్మించనున్న హిమామి సిమెంట్స్ మైనింగ్ ప్రాజెక్ట్ ప్రజాభిప్రాయ సేకరణ సభ మండలంలోని తంగెడ గ్రామంలో సోమవారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు గుంటూరు జిల్లా అదనపు జెసి మంగా వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈసందర్బంగా సభకు హాజయిన పలువురు రైతులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ తమకు ఫ్యాక్టరి నిర్మించడం, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం ఇష్టమేనని చెప్పారు. అయితే గతంలో పలువురు ఈ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీలు నిర్మిస్తామని హామిలు ఇచ్చి ఫ్యాక్టరిలు కట్టకుండా పంట భూములను బీడు భూములుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆశించి భూములు అమ్ముకున్న రైతులు ఫ్యాక్టరిలు నిర్మించకుండా ఉండటంతో భూములను కోల్పోయి పిల్లలకు ఉద్యోగాలు రాక అష్టకష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. ఈప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరిలు నిర్మించినవారు రైతులకు ఇచ్చిన హామీలను సక్రమంగా నెరవేర్చలేదని చెప్పారు. ఈనేపథ్యంలో హిమామి సిమెంట్స్‌వారు రైతులకు ఇచ్చే హామిలను రాతపూర్వకంగా ఇవ్వవలసినదిగా కోరారు. ఈకార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

లాభాలు పెంచుకోకపోతే ఇంతే సంగతులు...
పొన్నూరు, జూన్ 21: భారీగా నష్టం వచ్చినందున తొమ్మిదేళ్లు మూసేసిన పొన్నూరు ఆర్టీసీ డిపోను తిరిగి తె రిచాం... కోరినన్ని బస్సు సర్వీసులను కూడా ఇచ్చాం.. కొత్త బస్సులు సమకూర్చాం అయినా లాభాల బాట పట్టించాలన్న తపన సిబ్బందిలో కొరవడటం వలన కోట్లాది రూపాయల నష్టం వచ్చింది. ఇదే పరిస్థితి కొనసాగితే డిపోను తిరి గి మూసివేయక తప్పదన్న నిజాన్ని గమనించాలని ఆర్టీసీ ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి మంగళవారం ఇక్కడ జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. గత ఏడాది డిపోకు 4.50 కోట్ల రూపాయల మేరకు నష్టం రాగా గత 5 నెలల్లో 72 లక్షల మే రకు నష్టం వచ్చింది, ఇలా అయితే ఎలా అంటూ, హక్కు ల కోసం పోరాటం చేయడం మంచిదే కానీ నష్టాల్లో ఉ న్న ఈ డిపోకు ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచాలన్న తపన సిబ్బందికి లేకపోతే డిపో స్థితి ఎలా బాగుపడుతుందని ని లదీశారు. ప్రయాణికులు మన బస్సుల వద్దకే వస్తారని గొం తెమ్మకోర్కెతో ఉంటే ఎలా... మనమే వారి వద్దకు వెళ్లకపోతే నష్టాలు ఎలా తగ్గుతాయో చెప్పండని ప్రశ్నించారు. ఈ డిపోకు పురిటినెప్పులెన్నో ఉన్నాయి. పాత బస్టాండ్ సెంటర్‌లో ఉన్న ఆర్టీసీ పాయింట్‌ను మునిసిపాలిటీ వారు ఖాళీ చేయమంటున్నారు, డిపోలో 77 మంది సిబ్బంది 63 సర్వీసులు నడుపుతున్నా రాబడి రాకపోవడం దురదృష్టకరమన్నారు. లాభాల బాట పట్టించేందుకు శ్రమించాలని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ రమేష్‌బాబు, సిటిఎం వాణిశ్రీ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
చట్టాలను ఉల్లంఘిస్తున్న యాజమాన్యాలు
గుంటూరు (పట్నంబజారు), జూన్ 21: కార్మిక చట్టాలను మందుల కంపెనీల యాజమాన్యాలు ఉల్లంఘిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ కుమార్ ఆరోపించారు. ఫెడరేషన్ ఆఫ్ మెడికల్, సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పిలుపుమేరకు దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా మంగళవారం మెడికల్ రిప్స్ స్థానిక కొత్తపేటలోని సంజీవ మెడికల్ కాంప్లెక్సు నుండి ర్యాలీగా బయల్దేరి కలెక్టరేట్ చేరుకున్నారు. అక్కడ జరిగిన నిరసన కార్యక్రమాన్నుద్దేశించి కుమార్ మాట్లాడుతూ మెడికల్ రిప్స్ ఎంతోకాలం నుండి డిమాండ్ చేస్తున్న ఇండస్ట్రియల్ ట్రీ పార్టీ వెంటనే సమావేశపర్చి మెడికల్ రిప్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డిఆర్‌ఒ నాగబాబుకు సంఘ నాయకులు అందజేశారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి మురళీకృష్ణ, హనుమంతరావు, సంయుక్త కార్యదర్శి సుబ్బారావు, కోశాధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

యోగాతో సంపూర్ణ వికాసం
నాగార్జున యూనివర్సిటీ, జూన్ 21: యోగాభ్యాసం వల్ల శారీరక దృఢత్వంతోపాటు మానసిక వికాసం కూడా కలుగుతుందని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ ఆచా ర్య ఎ రాజేంద్రప్రసాద్ అన్నారు. వర్సిటీలోని యో గాసెంటర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ దైనందిన జీవితంలో తలెత్తే ఒత్తిడులను దూరం చేయడానికి యోగా దోహదపడుతుందని, మానసిక వికాసాన్ని కల్గించి త ద్వారా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని చేకూర్చడానికి యోగా దోహదం చేస్తుందని ఆయన తెలిపారు. 10వ బెటాలియన్ ఎన్‌డిఆర్‌ఎఫ్ కమాండెంట్ ప్రశాంత్‌దత్ మాట్లాడుతూ విద్యార్థులకు యో గా ఎంతో మేలు చేస్తుందని, మానసిక ప్రశాంతతోపాటు మానసిక దృఢత్వానికి యో గా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. వరల్డ్ కమ్యూనిటీ సెంటర్ సందేశాన్ని వినిపించిన కె రాధిక విద్యార్థులు, అధ్యాపకుల చేత యోగా చేయించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌డిఆర్‌ఎఫ్ 10వ బెటాలియన్ డెప్యూటీ కమాండెంట్ సోహాన్ సింగ్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆచార్య వై కిషోర్, వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పిపిఎస్ పాల్‌కుమార్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా పుష్కరాలకు ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది సేవలు
మంగళగిరి, జూన్ 21: వచ్చే ఆగస్టు మాసంలో జరుగనున్న కృష్ణా పుష్కరాల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది సేవలు అందిస్తారని జాతీయ విపత్తు భద్రతాదళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) డిఐజి పి సెల్వం పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఎన్‌డిఆర్‌ఎఫ్ 10వ బెటాలియన్ హెడ్‌క్వార్టర్‌ను సందర్శించారు. పుష్కరాలకు సేవలందించేందుకు సిబ్బంది సిద్ధం కావాలని డిఐజి సెల్వం కోరారు. రెస్క్యూ ఆపరేషన్‌కు కావాల్సిన అధునాతన పరికరాలను తిలకించారు. కమాండెంట్ ప్రశాంత్‌ధర్, ముఖ్య వైద్యాధికారి డాక్టర్ బీవీ రావు, డిప్యూటీ కమాండెంట్లు మధుసూధనరెడ్డి, కులదీప్‌సింగ్, సోహన్‌సింగ్, సంతోష్‌కుమార్, మనీత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఘన వ్యర్థాల కేంద్రాన్ని సందర్శించిన రస్తోగి
సత్తెనపల్లి, జూన్ 21: మండల పరిధిలోని నందిగామలోగల ఘన వ్యర్థాల నిర్వాహణ కేంద్రంను కలకత్తాకు చెందిన ఐటిసి ఎమ్‌ఎస్‌కె వైస్ ప్రెసిడెంట్ ముకుల్ రస్తోగి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఘన వ్యర్ధాల కార్యక్రమాన్ని బాగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై వ్యర్ధాల నిర్శహణ కేంద్రంకు వ్యర్ధాలు ఏవిధంగా సేకరిస్తున్నారన్నది అడిగి తెలుసు కున్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టును పంచాయితీ ద్వారా నిర్వహించేలా అందరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిసి ఎంఎస్‌కె సౌత్‌ప్రాజెక్టు మేనేజర్ మంజునాధ్, ప్రోగ్రామ్ మేనేజర్ సాయికిరణ్, రక్షణ సంస్థ డైరెక్టర్ వి. శ్రీదేవి, మార్కెట్ యార్డు చైర్మన్ ఆళ్ళ సాంబయ్య, గ్రామ సర్పంచ్ చెంబేటి నాగమల్లేశ్వరి బొల్లయ్య, ఎంపిటిసిలు, అంగన్‌వాడి కార్యకర్తలు, ప్రాజెక్టు కో ఆర్డినేటర్ కృష్ణ, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
వెంకన్నకు బంగారు పాదాలు
గుంటూరు (పట్నంబజారు), జూన్ 21: స్థానిక ఎస్‌విఎన్ కాలనీలోని శ్రీ పద్మావతీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు, లీలావతి దంపతులు మంగళవారం బంగారు పాదుకలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపి రాయపాటి మాట్లాడుతూ కోరిన కోర్కెలు తీర్చే వెంకన్నకు ఉడతాభక్తిగా బంగారు పాదుకలను అందజేయడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఆలయ చతుర్ధ వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అర్చక స్వాములు స్వామివారికి విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాసనతో పాటు ప్రత్యేక పూజలను నిర్వహించారు.
ఘనంగా యోగా దినోత్సవం
మంగళగిరి, జూన్ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మంగళవారం పట్టణంలోను, పరిసర గ్రామాల్లోను జరుపుకున్నారు. సామూహిక యోగా ప్రదర్శనలు జరిగాయి. పట్టణంలోని నన్నపనేని కల్యాణ మండపంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యాన జరిగిన యోగా దినోత్సవంలో పోలీసు, మున్సిపల్ సిబ్బందితో పాటు పట్టణానికి చెందిన పలువురు యోగా ప్రదర్శనలు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కర్నూలు రేంజి డిఐజి బీవీ రమణకుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్యం కొంత సమయాన్ని యోగాసాధనకు కేటాయించాలని అన్నారు. మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, డిఎస్పీ రామాంజనేయులు, రైల్వేబోర్డు సభ్యుడు నన్నపనేని నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. వివిధ పాఠశాలల విద్యార్థులు యోగా ప్రదర్శన చేశారు. స్థానిక గాలిగోపురం ఎదుట శ్రీ వెంకటేశ్వర యోగాసేవాకేంద్రం ఆధ్వర్యాన యోగాసనాలు, పట్టణ వీధుల్లో ప్రదర్శన చేశారు. వెంకటేశ్వరయోగి యోగా విశిష్టతను వివరించారు. మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవిని సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది కూడా హెడ్‌క్వార్టర్‌లో యోగాసనాలు ప్రదర్శించారు. కమాండెంట్ ప్రశాంత్‌ధర్, డిప్యూటీ కమాండెంట్ మధుసూధనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ రాధాకృష్ణ యోగాసేవాకేంద్రం ఆధ్వర్యాన లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో అంతర్జాతీ యోగా దినోత్సవం జరిపారు. బుర్రముక్కు వేణుగోపాలరెడ్డి, సుందరమూర్తి గుప్తా, తదితరులు పాల్గొని రాధాకృష్ణ యోగిని ఘనంగా సత్కరించారు. మండల పరిధిలోని చినకాకాని ఎన్నారై వైద్య కళాశాలలో వైద్యివిద్యార్థులు యోగాసనాలు ప్రదర్శించారు. ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు ముఖ్య అతిథిగా ప్రకృతి జీవన విధానంపై వైద్యవిద్యార్థులకు, అధ్యాపకులకు వివరించారు. ఎన్నారై అకాడమీ ఆఫ్ సైనె్సస్ కార్యదర్శి డాక్టర్ నరసరాజు, ప్రిన్సిపాల్ సాయి, సూపరింటెండెంట్ ఫణిభూషణ్, సిఇఓ శ్రీ్ధర్, కిషోర్, బుర్రా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.