గుంటూరు

మన్నవకే మార్కెట్ యార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 5: గుంటూరు మార్కెట్‌యార్డు చైర్మన్ పదవికి మన్నవ సుబ్బారావుకు ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన్నవను చైర్మన్‌గా ఎంపిక చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీడియా సమక్షంలో వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు ఈ పదవిపై నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగిపోయింది. డైరెక్టర్ల పదవులకు ఎమ్మెల్యేలు పేర్లను సూచించక పోవడంతో నియామకాల భర్తీ కొలిక్కిరావడం లేదు. మార్కెట్‌యార్డు చైర్మన్ పదవిని తన అనుచరుడైన వెన్నా సాంబశివారెడ్డికి ఇవ్వాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి ఇప్పటివరకు పట్టుపట్టారు. అయితే మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు మన్నవకు మద్దతిచ్చారు. దీంతో పంచాయతీ ముఖ్యమంత్రి వద్దకు చేరింది. మన్నవను చైర్మన్‌గా నియమించేందుకు సిఎం సుముఖంగా ఉన్నారని పుల్లారావు తెలిపారు. ఇలా ఉండగా డైరెక్టర్ల పదవులకు రంగంలో ఉన్న ఆశావాహుల జాబితా ఖరారు చేసేందుకు టుబాకో బోర్డు అసోసియేషన్ హాలులో జిల్లా పార్టీ కోర్ కమిటీ సమావేశమైంది. డెప్యూటీ సిఎం చినరాజప్ప నేతృత్వంలో జరిగిన ఈ కమిటీలో ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. దీంతో ముఖ్యమంత్రి నేరుగా మార్కెట్‌యార్డు చైర్మన్‌గా మన్నవను త్వరలో ప్రకటించనున్నట్లు చెప్తున్నారు. యార్డుచైర్మన్‌తో పాటు 19 మంది డైరెక్టర్లలో నలుగురు అధికారులు ఎక్స్ అఫిషియో సభ్యులుగా వ్యవహరిస్తారు. మరో ఐదుగురిని రిజర్వేషన్ కేటగిరి నుంచి ఎన్నుకుంటారు. గుంటూరు పశ్చిమ, తూర్పు, తాడికొండ, పొన్నూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు చెందిన 99 గ్రామాలు యార్డు పరిధిలోకి వస్తాయి. ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధే అధికంగా ఉంది. విస్తీర్ణాన్ని బట్టి డైరెక్టర్ల పదవులకు ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించారు. కాగా మన్నవ సుబ్బారావు 1994 నుంచి తెలుగుదేశం పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించారు. మేడికొండూరు జెడ్పీటీసీ స్థానానికి పోటీచేసి గెలుపొందిన ఆయన అప్పట్లో జెడ్పీ చైర్మన్ పదవి రేసులో ఉన్నారు. జిల్లా పార్టీలో జెడ్పీ చైర్మన్ పదవికి పలువురు పోటీపడిన నేపథ్యంలో మన్నవకు అవకాశం చేజారింది. జిల్లా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన మన్నవ ప్రస్తుతం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

3 కోట్లతో ఓవర్‌బ్రిడ్జికి మరమ్మతులు
మంగళగిరి, జూలై 5: మంగళగిరి - విజయవాడ మార్గంలో పట్టణ శివారులో రైల్వేలైనుపై గల రోడ్డు ఓవర్‌బ్రిడ్జికి 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు కావడంతో ఆర్ అండ్ బి అధికారులు మరమ్మతు పనులు ప్రారంభించారు. నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఓవర్‌బ్రిడ్జికి రెండువైపులా ఉన్న గోడలు దుస్థితికి చేరాయి. అప్పట్లో నిర్మించిన ఫుట్‌పాత్ దశల వారీగా ధ్వంసమై అదృశ్య మయింది. కృష్ణా పుష్కరాలు, ఈ ప్రాంతం రాజధాని కావడం నేపధ్యంలో ఓవర్‌బ్రిడ్జిని పటిష్ఠ పరచాలనే లక్ష్యంతో ప్రభుత్వం మరమ్మతుల కోసం 3 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. సుమారు కిలోమీటరు పొడవున ఉన్న ఓవర్‌బ్రిడ్జికి ఇరువైపులా శిథిల స్థతిలో ఉన్న గోడలను జెసీబీతో తొలగిస్తున్నారు. మరమ్మతుల్లో భా గంగా రెండువైపులా కాంక్రీ ట్ గోడలను, ఫుట్‌పాత్‌ల ను ఏర్పాటు చేస్తున్నామని ఆర్ అండ్ బి ఇంజినీరింగ్ అధికారులు వెల్లడించారు.