గుంటూరు

ముందు మీ అవినీతిని తేల్చండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 5: ప్రభుత్వ వైఫల్యాలపై గడపగడపకూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహనరెడ్డి ముందు తన అవినీతి వ్యవహారం.. ఈడి అటాచ్‌మెంట్ చేసిన ఆస్తుల గురించి ప్రజలకు వివరించాలని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. మంగళవారం గుంటూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ దేశంలో ఏ పార్టీ నాయకునిపై లేనన్ని ఆరోపణలు, అభియోగాలు జగన్‌పై ఉన్నాయన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏ మేరకు ఆస్తులు సంపాదించారో ప్రజలకు తెలుసన్నారు. గడపగడపకు కార్యక్రమంతో ప్రజలే జగన్‌కు బుద్ధి చెప్తారన్నారు. గనులు, సెజ్‌ల పేరుతో వేలాది ఎకరాలు అయినవాళ్లకు దోచిపెట్టి లక్ష కోట్ల ప్రజాధనం లూటీ చేసిన జగన్ ప్రతిపక్ష నేతగా అనర్హుడన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటయిన రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి.. జగన్ అవినీతిపై బహిరంగ ఓటింగకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. వైసీపీ కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇనచార్జిలదే అని జగన్ బెదిరించడం తన అభద్రతా భావానికి నిదర్శనమన్నారు. అసలు ఏ నియోజకవర్గంలో ఇనచార్జిలు ఉన్నారో ఆయనకే తెలీదని ఎద్దేవా చేశారు. ఇవన్నీ తేలిన తరువాత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో రచ్చబండ గ్రామసభల ద్వారా ప్రభుత్వ పనితీరుని నిరూపించుకునేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ఇందుకు వైసీపీ సిద్ధమేనా అని ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలవాలన్నారు. దేశ చరిత్రలోనే రైతుల రుణమాఫీ ఏ రాష్ట్రంలో అమలు కాలేదన్నారు. తమ ప్రభుత్వం రూ. 24వేల కోట్లు రుణ విమోచనకు కేటాయించి రెండేళ్లలో 11వేల 500 కోట్లు మాఫీ చేసిందని వివరించారు. ఈ ఏడాది ముందస్తు ఖరీఫ్ సీజన్‌ను ప్రకటించి 8లక్షల 40వేల ఎకరాల్లో పంటలు వేసేలా రైతుల్ని జాగృతం చేశామన్నారు. వీటితో పాటు స్వల్పకాలిక పంటలైన పప్పు ధాన్యాలు 50వేల హెక్టార్లలో సాగు లక్ష్యం కాగా 40వేల హెక్టార్లలో పండించారని, మరో 45వేల ఎకరాల్లో నవధాన్యాల సాగు జరిగిందని వివరించారు. రైతులకు అన్నివిధాల అండగా తమ ప్రభుత్వం నిలుస్తుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ గడపగడపలో జగన్‌కు ప్రతిఘటన ఎదురుకాక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి మన్నవ సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఎం జియావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

హత్య చేసి పట్టాలపై పడేశారు..
సత్తెనపల్లి, జూలై 5: గుంటూరు-సికింద్రాబాద్ రైలు మార్గంలోని స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని భీమవరం రైల్వే గేటు దగ్గర ముప్పాళ్ళ మండలం ఇరుకుపాలెం గ్రామానికి చెందిన బొద్దుకూరి మరియదాసు (42) మృతదేహాన్ని రైల్వే పోలీసులు మంగళవారం కనుగొన్నారు. రైల్వే సిఐ ఎస్‌కె బిలాలుద్దీన్ కధనం ప్రకారం తమకు మంగళవారం ఉదయం సత్తెనపల్లి రైల్వే ష్టేషన్ నుండి భీమవరం రైలుగేటు సమీపంలో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందిందన్నారు. తాము సంఘటనా స్థలం వద్దకు చేరుకొని విచారించి, మరియదాసుగా గుర్తించామన్నారు. ఇతనిని ఎవరో వేరేచోట హత్యచేసి రైల్వేట్రాక్‌పై పడవేసినట్లు సిఐ తెలిపారు. మృతుడి తలపై బలమైన గాయాలు వున్నాయని, సంఘటనా స్థలంలో ఏవిధమై రక్తపు మరకలు లేవని తెలిపారు. హత్య అనంతరం నిందితులు మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై పడవేయడంతో కాలు, చెయ్యి తెగిపోయివున్నాయని సిఐ వివరించారు. జిల్లాలోని పలు పోలీస్టేషన్లలో హత్యానేరం కేసులు మృతుడిపై వున్నట్లు తెలిసిందని, దర్యాప్తులో ఎవరు హత్య చేశారో త్వరలోనే తేలుతుందని అన్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.