గుంటూరు

గణేశుని సేవలో పులకించిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), సెప్టెంబర్ 6: వినాయక చవితి పండుగ, నవరాత్రి ఉత్సవాలను నగర ప్రజానీకం అత్యం త భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంది. ఈ సందర్భంగా సోమవారం చవితి శుభ ఘడియలు ప్రారంభమైనప్పటి నుండి రాత్రి వరకు ప్రత్యేక పూజలను, 21 పత్రి పుష్పాలతో గజాననుడిని తమ స్వగృహాలు, ఉత్సవ వేదికలపై అర్చించుకుని భక్తులు పులకించారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు కూడా చవితి పందిరిలలో రోజంతా విశేష అర్చనలు కొనసాగాయి. రెండవ రోజైన మంగళవారం నాడు పూజలు నిర్వహించుకున్న మట్టి గణపతికి ఉద్వాసన పలక కూడదన్న పండితుల సలహాను అనుసరించి యథావిధిగా అర్చనలు కొనసాగించారు. ఈ సందర్భంగా పాత గుంటూరులోని ప్రాచీన శ్రీ గుంటి విఘ్నేశ్వర స్వామివారికి సోమ, మంగళవారాల్లో ప్రభాతవేళ పంచామృతాలతో అభిషేకం, చందన, కస్తూరి, గంధాలతో స్నపన తిరుమంజనం జరిగింది. వేలాది మంది భక్తులు అభిషేకాన్ని, పుష్పశోభతో కనువిందు చేసిన ఉమాపుత్రుడిని సేవించుకున్నారు. నగరంలోని 52 డివిజన్లలో గతంలో కన్నా ఈ సంవత్సరం ఉత్సవ వేదికలపై కొలువుతీరిన బొజ్జ గణపయ్య ప్రతిమల సంఖ్య అధికమైంది. దాదాపుగా 2 వేలకు పైగా చిన్న, పెద్ద విగ్రహాలను పందిరిలలో ఏర్పాటుచేసి పూజలు నిర్వహిస్తున్నారు. పాత గుంటూరులోని పలు వాడలు, నెహ్రూనగర్, కొత్తపేట, గుంటూరువారితోట, నాజ్‌సెంటర్, రైలుపేట, డొంకరోడ్డు, అరండల్‌పేట, బ్రాడీపేట, జూట్‌మిల్లు ఏరియా, పట్ట్భాపురం, శ్యామలానగర్, ఎన్జీవో, హౌసింగ్‌బోర్డు కాలనీలు, స్తంభాల గరువు, ఎస్‌విఎన్ కాలనీ, రింగురోడ్డు, విద్యానగర్, లక్ష్మీపురం, పండరీపురం, చంద్రవౌళినగర్ తదితర ప్రాంతాల్లో భారీగా విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆర్ అగ్రహారంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సమీపంలో వాసవీ యూత్ ఆధ్వర్యాన 18వ నవరాత్రి మహోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. లక్ష్మీపురంలోని శ్రీ గణేష్ ఉత్సవ మండలి ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన వేదికపై 18 అడుగుల భారీ గణనాథుడు దివ్య దర్శనమిచ్చారు. అరండల్‌పేట శ్రీ రమాసత్యనారాయణ స్వామి దేవాలయం వద్ద మాజీ కార్పొరేటర్ ఆలా సాంబశివరావు నేతృత్వంలో నయన మనోహరంగా గణేష్ చతుర్ధి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. లక్ష్మీపురం గణేష్ ఉత్సవ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చవితి పందిరి, అరండల్‌పేట ఆలా సాంబశివరావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేడుకల్లో పలువురు బాల కళాకారులు, వీణ కళాకారులు నాదార్చన చేశారు.
ప్రత్యేకహోదా కోసం
ప్రత్యేక పూజలు...
కొత్తపేటలోని గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉత్సవ వేదికపై కొలువుతీరిన భారీ గణపతికి మాజీ మంత్రి, టిడిపి అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ పూజలు నిర్వహించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేలా అనుగ్రహించాలని ప్రార్థించారు. వాడవాడలా ముఖ్యంగా యువత నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటు, అభివృద్ధికి అలాగే ప్రత్యేక హోదా రావడంలో పార్వతీపుత్రుని అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేయాలని కోరారు. హిందూ ధర్మరక్షా సమితి గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షుడు దర్శనపు శ్రీనివాస్ రాష్ట్భ్రావృద్ధి కి హోదా ఎంతైనా అవసరమన్నారు.