ఖమ్మం

సాదాబైనామాల చెక్‌మెమోలను అప్‌లోడ్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 6: సాదాబైనామలకు సంబంధించిన ఫీల్డ్ చెక్‌మెమోలను వారంరోజుల్లో అప్‌లోడ్ చేయాలని దివ్య తహశీల్దార్లను ఆదేశించారు. సాదాబైనామల ప్రగతి, కళ్యాణ లక్ష్మి, భూదన్ ల్యాండ్, ఎస్‌ఆర్వో, ఎంఆర్వో ప్రగతిపై మంగళవారం తహశీల్దార్లతో జెసి వీడియోకాన్పరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాదాబైనామలకు వచ్చిన దరఖాస్తులను పరిశీలన, తిరస్కరణ, చెక్‌మెమోస్, ఆన్‌లైన్ నోటీస్‌ల జారీను వేగవంతం చేయాలన్నారు. తహశీల్దార్లు గ్రామాల్లోకి వెళ్ళి సాదాబైనామకు అందిన దరఖాస్తులను పరిశీలించాలన్నారు. నోటీసులు జారీ చేసిన తర్వాత చెక్‌మెమోలను ఆన్‌లైన్ చేయాలని ఆదేశించారు. ఫాం 11,12ల ద్వారా నోటీసులు జారీ చేసిన తర్వాత ఏలాంటి అభ్యంతరాలు రానివాటిని మాత్రమే అప్‌లోడ్ చేయాలన్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల నుండి తహశీల్దార్లకు పంపబడిన మ్యూటేషన్లను వారం రోజుల్లో ప్రగతి చూపాలన్నారు. సాధారణ మ్యూటేషన్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయని, వీటిపై దృష్టిపెట్టాలన్నారు. నిత్యావసర వస్తువులను రేషన్‌కార్డు దారులు విక్రయిస్తే వారిపై 17బి,డి, కొనుగోలు చేసిన వారిపై 17ఇ, 6ఏ కేసులను నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. దీపం పథకంపై జెసి మాట్లాడుతూ జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసి పొగరహిత గ్రామాలుగా మార్చాలన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్‌లను సమిక్షించిన జెసి సంఘీక సంక్షేమ శాఖలో 1,041 రిజిస్ట్రారు కాగా 550 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అలాగే షెడ్యూల్ తెగలకు సంబంధించి 1,442 దరఖాస్తులకు 940, బిసి వెల్పేర్‌కు 1,383కు గాను 876, ఇబిసికు సంబంధించి 60 దరఖాస్తులకు 53, షాదీముబారక్‌కు 422 దరఖాస్తులు రాగా 342 పెండింగ్‌లో ఉన్నాయని, వీటిపై తహశీల్దార్లు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బిసి కార్పోరేషన్ ఉపసంచాలకులు యూసప్ అలి, డిఎస్‌ఓ ఉషారాణి, బిసి కార్పోరేషన్ ఇడి ఆంజనేయ శర్మ తదితరులు పాల్గొన్నారు.