గుంటూరు

’హోదాకు సమానం అనడమే పెద్ద మోసం‘

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 12: ప్రత్యేకహోదాతో సమానమైన సహాయం చేస్తామని అనడమే పెద్ద మోసం అని, కొత్తగా హోదా వల్ల నష్టమే అని ప్రచారం ప్రారంభించడం దుర్మార్గమని పలువురు వక్తలు పేర్కొన్నారు. అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో సోమవారం చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు సభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి మాట్లాడుతూ ఏమీ లేనిదానికి, మరేమీ చేయనిదానికి హోదా, సాయం పేరుతో ఇంత నాటకం జరగడం దేశంలోనే ఇదే ప్రథమమన్నారు. అరుణ్‌జైట్లీ అండ్ కో నడిపించిన అర్ధరాత్రి కుతంత్రం రాష్ట్ర ప్రజలను ఆగ్రహంతో ఊగిపోయేట్లు చేసిందన్నారు. పుష్కరాలకు సమాంతరంగా నడిచిన ఈ రాజకీయ క్రీడతో హోదా కృష్ణార్పణం, ప్యాకేజీకి పిండప్రదానం జరిగిందని ఎద్దేవాచేశారు. అర్ధశాస్త్ర నిపుణుడు డాక్టర్ ఎల్‌ఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ సమానమైన సహాయం అనేది ఆచరణలో సాధ్యం కాదన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ కోసం ట్యాక్స్ హాలిడే కింద 500 కోట్లు ఇస్తామంటే సరిపోదని, జైట్లీ ప్రకటించిన సాయం అరకొరగానే ఉందన్నారు. చర్చా కార్యక్రమంలో విద్యావేత్త ఇ చంద్రయ్య, న్యాయవాది ఎన్ గురుదత్, సమాచార హక్కు అమలు కమిటీ కన్వీనర్ నరసింహులు, సుబ్రహ్మణ్యం, పి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

జూట్‌మిల్లు సమస్యను పరిష్కరించకుంటే
ఆమరణ దీక్ష
గుంటూరు, సెప్టెంబర్ 12: భజరంగ్ జూట్‌మిల్లు కార్మికుల సమస్యలను పరిష్కరించి మిల్లును తెరిపించకుంటే అక్టోబర్ 2వ తేదీ నుంచి కార్మికులు ఆమరణ నిరాహార దీక్షలకు దిగనున్నట్లు కలెక్టర్ కాంతిలాల్ దండేకు జూట్‌మిల్లు పరిరక్షణ సమితి అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి స్పష్టంచేశారు. సోమవారం ఈ మేరకు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. జూట్‌మిల్లు లాకౌట్‌కు గురై 14 నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కరించక పోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు మిల్లు వద్ద కార్మికుల నిరాహార దీక్షల వద్దకు వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అమలు కాలేదన్నారు. యాజమాన్యంపై ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబించి మిల్లును వెంటనే తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. కార్మికుల పక్షాల యాజమాన్య వైఖరిపైనా ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ ఈనెల 14వ తేదీ నుంచి కలెక్టరేట్ ఎదుట సామూహిక నిరాహారదీక్షలు చేపడుతున్నామన్నారు. అప్పటికీ స్పందించకుంటే అక్టోబర్ 2న కార్మికులు అమరణ నిరాహారదీక్షకు దిగుతారని స్పష్టంచేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, సిపిఎం నగర కార్యదర్శి భావన్నారాయణ, కార్మిక నాయకులు ఎబ్బూరి పాండురంగ, మందా రవింద్రనాధ్ తదితరులు పాల్గొన్నారు.