గుంటూరు

రాజధాని నిర్మాణాల పేరిట.. ప్రజాధనం దుబారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 28: రాజధాని పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని దుబారా చేస్తోందని ఎపిసిసి అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి ఆరోపించారు. సోమవారం గుంటూరు వచ్చిన ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్‌లో విలేఖర్లతో మాట్లాడారు. రాజధాని నిర్మాణమంటూ విదేశీ పర్యటనల పేరిట కోట్లాది రూపాయలను ప్రభుత్వం వెచ్చించిందని, ఈ డబ్బుతో అసెంబ్లీ, సెక్రటేరియట్ల నిర్మాణం పూరె్తై ఉండేదన్నారు. అయితే ఇప్పటివరకు ఒక్క నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం చేపట్టలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సంబంధించిన ప్రాధాన్యతాంశాలు తెలియకుండా పాలన సాగిస్తున్నాయని విమర్శించారు. అంగన్‌వాడీలు తమ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే లాఠీఛార్జ్ చేయడంతోపాటు వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం సరికాదన్నారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చిన టిడిపి ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఆరోపించారు. రాష్ట్రంలో జరగని పనులన్నింటినీ జరిగినట్లుగా ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. యువత, రైతులు, ఉద్యోగులు తమ సమస్యల సాధనకు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైందన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో రైతులు వేసిన ఆరుతడి పంటలకైనా ప్రభుత్వం నీరు ఇస్తుందో, లేదో స్పష్టంచేయాలని రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. విలేఖర్ల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు జెడి శీలం, జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మక్కెన మల్లికార్జునరావు, ఎంవి ముత్యాలరావు, మాజీ ఎమ్మెల్యేలు లింగంశెట్టి ఈశ్వరరావు, చదలవాడ జయరాంబాబు, షేక్ మస్తాన్‌వలి పాల్గొన్నారు.