గుంటూరు

వృద్ధులకు ప్రభుత్వం ఆసరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 1: రాష్ట్రంలోని వయోవృద్ధుల సంక్షేమం కోసం మూడు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద కోటి 40 లక్షల రూపాయలతో వృద్ధుల ఆశ్రమాలను ప్రభుత్వం నిర్మిస్తుందని రాష్ట్ర స్ర్తి, శిశు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ, గనుల భూగర్భ శాఖల మంత్రి పీతల సుజాత ప్రకటించారు. శనివారం స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపంలో రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన రాష్టస్థ్రాయి 26వ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేడుకలకు ఆ శాఖ డైరెక్టర్ కె శారదాదేవి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి సుజాత మాట్లాడుతూ రాష్ట్రంలోని అనంతపురం, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో వృద్ధుల ఆశ్రమాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. తొలుత 100 మందితో ఒక ప్రైవేటు భవనంలో ఆశ్రమాన్ని నిర్వహిస్తామన్నారు. త్వరలో శాశ్వత భవనాలు ఏర్పాటుకాగానే వాటిలోకి ఆశ్రమాలను తరలిస్తామన్నారు. వృద్ధులైన తల్లిదండ్రులను గౌరవించుకోలేని స్థితిలో నేటి సమాజం ఉందని, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వృద్ధులైన తల్లిదండ్రులకు మంచి శక్తిని, ఆరోగ్యాన్ని కలిగిస్తాయన్నారు. వృద్ధుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సుల చార్జీల్లో 25 శాతం రాయితీ కల్పించడం జరిగిందన్నారు. రాష్టవ్య్రాప్తంగా 43.45 లక్షల మంది ప్రభుత్వం నుండి వివిధ రకాల పింఛన్ పొందుతుండగా, వారిలో 21 లక్షల మంది వృద్ధులకు నెలకు వెయ్యి రూపాయలు వంతున ప్రభుత్వం పింఛన్ అందిస్తోందన్నారు. ఇందుకోసం నెలకు 214 కోట్ల రూపాయలు ఖర్చవుతోందని పేర్కొన్నారు. వయోవృద్ధుల సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి కార్యాలయానికి త్వరలో తగిన స్థలాన్ని నిర్ణయిస్తామని వెల్లడించారు. వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని వయోవృద్ధుల సమస్యలను రాష్ట్రప్రభుత్వం తప్పక పరిష్కరిస్తుందని, ఆ దిశగా తగిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి జి జయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలోని వయోవృద్ధులకు ఆసరా కల్పించేందుకు కర్రలు, కళ్లజోళ్లు, వినికిడి యంత్రాలు, ఇతర వైద్య పరికరాలను అందించేందుకు రూ. 50 లక్షలు ప్రభుత్వం కేటాయించిందన్నారు. ప్రతి మూడు నెలలకొకసారి వృద్ధుల సంక్షేమ సంఘం ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా రాష్టవ్య్రాప్తంగా వివిధ జిల్లాల నుండి ఎంపికైన 15 మంది వయోవృద్ధులకు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును అతిథులు అందజేశారు. వృద్ధులకు సేవలందిస్తున్న 7 సంఘాల ప్రతినిధులకు ఉత్తమ సంస్థ అవార్డులను అందించారు. కార్యక్రమంలో కలెక్టర్ కాంతిలాల్ దండే, జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ, వివిధ ప్రతిభావంతుల, వయోవృద్ధుల సహాయ సంస్థ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు, సీనియర్ సిటిజన్స్ సమాఖ్య గుంటూరు శాఖ అధ్యక్షుడు సిహెచ్ పరమేశ్వరరెడ్డి, కార్యదర్శి వి నారాయణమూర్తి, రాష్టశ్రాఖ కమిషనర్ చక్రవర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి, అచ్యుతరామయ్య, వృద్ధులు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీదేవీశరన్నవరాత్రులు ప్రారంభం
పొన్నూరు, అక్టోబర్ 1: శక్తి స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు పట్టణంలోని ఆలయాల్లో వైభవంగా ఆరంభమయ్యాయి. ఇక్కడి దేవాలయాల్లో వివిధ రూపాలతో శనివారం అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. జిబిసి రోడ్డు పక్కన కొలువైయున్న కనకదుర్గ్భావానీ ఆలయంలో అమ్మవారికి 11రకాల అభిషేకాలు, కలశస్నపన, మండపారాధన, అఖండ జ్యోతి ప్రజ్వలన అనంతరం బాలాత్రిపుర సుందరి అలంకారంతో శోభిల్లిన అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. సహస్రలింగేశ్వర స్వామి ఆలయంలోని అమ్మవారు, వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు కూడా బాలాత్రిపురసుందరీదేవి అలంకారంలో పూజలందుకున్నారు.

వైభవంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం
మంగళగిరి, అక్టోబర్ 1: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణ, పరిసర గ్రామాల్లోని వివిధ ఆలయాల్లో శరన్నవరాత్రి మహోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభ మయ్యాయి. స్థానిక శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారిని బాలత్రిపుర సుందరీదేవిగా అలంకరించారు. శ్రీ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో రాజ్యలక్ష్మీ అమ్మవారికి రాజ్యలక్ష్మీ అలంకారం చేశారు. ఎర్రచెరువు మలుపు వద్దగల కాళీమాత ఆలయంలో అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పాతమంగళరి దుర్గానగర్ కనకదుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి వనబాల అలంకారం చేశారు. హుస్సేన్‌కట్ట వద్ద గల కనకదుర్గ ఆలయంలో అమ్మవారికి బాలాత్రిపుర సుందరి అలంకారం, కోర్టు ఎదుట గల అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి స్వర్ణకవచాలంకృత అఖిలాండేశ్వరిగా, పెదకోనేరువద్ద గల దుర్గ్భావాని ఆలయంలో బాలాత్రిపుర సుందరి అలంకారం చేశారు. మెయిన్ బజార్‌లోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి వనబాల అలంకారం చేశారు. ఆయా ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి అలంకారోత్సవాలను తిలకించేందుకు భక్తులు ఆలయాలను సందర్శించడంతో దసరా సందడి నెలకొంది. ఆలయాలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో సుందర శోభాయమానంగా అలంకరించారు.

కృష్ణానదిలో మహిళ ఆత్మహత్య
తాడేపల్లి, అక్టోబర్ 1: పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లోటస్ ఫుడ్ సిటీ సమీపంలో కృష్ణానదిలో శనివారం ఒక మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె మృతదేహం వద్ద లభించిన ఒక బస్సు టిక్కెట్‌లో రమాదేవి(25) సంవత్సరాలు, హైదరాబాద్ నుండి సెప్టెంబర్ 29వ తేదీన విజయవాడకు వచ్చినట్లు తెలుస్తోందని, అనంతరం కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. తాడేపల్లి ఎస్సై ప్రతాప్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా స్థానిక రైలుబ్రిడ్జ్ వద్ద పోలయ్య అనే యువకుడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. అయితే అతడు మచిలీపట్నానికి చెందిన వాడని, మహానాడులో స్నేహితులతోకలిసి ఉంటున్నట్లు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తాడేపల్లి పోలస్‌స్టేషన్ పరిధిలో కుంచనపల్లి సమీపంలో బ్రిడ్జ్‌పై నుండి బకింగ్‌హాం కెనాల్‌లో దూకి కృష్ణకుమార్ అనే 67 సంవత్సరాల వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. స్థానిక విఆర్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న కృష్ణకుమార్ అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతున్నాడని బంధువులు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. పోలీసులు కృష్ణకుమార్ కోసం గాలిస్తున్నారు.