గుంటూరు

పురసేవ యాప్ ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కార్పొరేషన్), అక్టోబర్ 18: నగర ప్రజల సౌకర్యార్థం పురసేవ యాప్‌ను కమిషనర్ నాగలక్ష్మి మంగళవారం ఆవిష్కరించారు. ఇప్పటివరకు 103 ఆన్‌లైన్ ఫిర్యాదుల కాల్‌సెంటర్లను ఏర్పాటుచేసి సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఇకపై అధునాతన సాంకేతిక నైపుణ్యంతో నేరుగా ఫోన్ నుంచి సమస్యపై ఫిర్యాదు చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు వివరించారు. గూగుల్ నుండి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, ఈ యాప్‌ద్వారా పారిశుద్ధ్య సమస్యలు, రోడ్డు, కాల్వల నిర్మాణాలు, మరమ్మతులు, వీధిదీపాలు, నిర్మాణ ప్లాన్లు, మంచినీటి సరఫరా, ఆక్రమణలు, జనన-మరణ ధ్రువీకరణ పత్రాలు, రుణాలతో పాటు 91 రకాల సేవలను యాప్‌లో పొందుపర్చామన్నారు. ఈ యాప్‌ద్వారా నమోదైన ఫిర్యాదు నేరుగా సంబంధిత అధికారికి చేరుతుందని, నిర్దేశిత గడువులోగా పరిష్కరించక పోగా ఉన్నతస్థాయి అధికారికి అంతిమంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరేట్, పురపాలక శాఖ మంత్రి దృష్టికి వెళ్తుందని, అప్పటికీ పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రి దృష్టికి చేరుతుందని వివరించారు. ఫిర్యాదుల క్రమంలో స్థాయిని అనుసరించి నిర్లక్ష్యపు నిర్వహణకు బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. నగర ప్రజలు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు.

మహిళల అభ్యున్నతికి మహిళా గ్రూపులు దోహదం
మేడికొండూరు, అక్టోబర్ 18: మహిళల అభివృద్ధి కోసం ప్రపంచంలో మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం మహిళా గ్రూపులను ఏర్పాటు చేసిందని గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ అన్నారు. మంగళవారం స్థానికంగా ముస్లింల శ్మశానవాటిక, గిరిజనవాడల్లో లక్షన్నర రూపాయలతో నిర్మించనున్న రహదారులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో జయదేవ్ మాట్లాడుతూ గ్రూపులను పటిష్టం చేసుకుని కుటుంబాలతో పాటు పాడిపరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, విద్యార్థుల చదువుకు ఉపయోగించుకోవాలన్నారు. ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ 18 నుండి 60 సంవత్సరాలలోపు వారు చంద్రన్న బీమా పథకంలో సభ్యత్వం పొందాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన పల్స్ సర్వేలో అధికారులకు సహకరిస్తే సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. మండలంలో నేటికీ 26,383 కుటుంబాల సర్వే పూరె్తైందన్నారు. సర్వేపై ప్రతిపక్షాల విమర్శలు సరికాదన్నారు. డ్వాక్రా మహిళలకు చెక్కులు, గ్యాస్ కనెక్షన్లు, అగ్నిబాధితులకు ఆర్థికసాయాన్ని అతిథులు సభలో అందజేశారు. మండలంలోని పేరేచర్ల, సిరిపురం, మేడికొండూరు జిల్లా పరిషత్ పాఠశాలల్లో కంప్యూటర్ల కొనుగోలుకు మంజూరైన లక్షా 65 వేల రూపాయల చెక్కును జెడ్పీ నిధుల నుండి గుంటుపల్లి సాంబశివరావు ఎంపి జయదేవ్ చేతుల మీదుగా హెచ్‌ఎం ప్రసాదరావుకు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గుంటుపల్లి సాంబశివరావు, జెడ్పీ వైస్‌చైర్మన్ వి పూర్ణచంద్రరావు, కంచర్ల శివరామయ్య, హజ్ యాత్ర డైరెక్టర్ హసన్‌బాషా, సర్పంచ్ తలతోటి సంధ్యారాణి, ఎంపిటిసిలు మసీదు సలీమాబి, మార్త శ్రీనివాసరావు, దండా శ్రీనివాసులురెడ్డి, మాజీ జెడ్పీటీసీ పి శివన్నారాయణ, నార్నె శ్రీనివాసరావు, ఎండిఒ పద్మజ, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, వ్యవసాయ అధికారిణి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎంపి గల్లా జయదేవ్, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం మేడికొండూరులోని వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నవంబర్ 1వ తేదీ నుండి ప్రారంభం కానున్న జనచైతన్య యాత్రల్లో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు.