గుంటూరు

కృషితో క్రీడా విజయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (స్పోర్ట్స్), నవంబర్ 7: క్రీడాకారులు కృషితో విజయం సాధించాలని, ఒత్తిడిని అధిగమించడానికి క్రీడాకారులు తమ శక్తివంచన లేకుండా కృషి చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. స్థానిక ఎన్‌టిఆర్ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో సోమవారం ప్రారంభమైన 62వ రాష్టస్థ్రాయి స్కూల్‌గేమ్స్ అండర్-14, 17 బాలబాలికల టెన్నిస్ పోటీల కార్యక్రమానికి అధ్యక్షత వహించి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదుగుల మాట్లాడుతూ భారతదేశాన్ని అనారోగ్యం పట్టిపీడిస్తుందని, సరైన ఆహారం, ఆరోగ్యంతో దీని నుండి విముక్తి పొందవచ్చన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో క్రీడలకు సముచితస్థానం ఉంటుందని, ప్రత్యేకించి గుంటూరు క్రీడానగరంగా రూపుదిద్దుకోనుందన్నారు. ముఖ్యఅతిథి ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ మాట్లాడుతూ టెన్నిస్ వంటి మంచి క్రీడను స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ వారు గుంటూరులో నిర్వహించడం అభినందనీయమన్నారు. పాఠశాలల్లో వ్యాయామ విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ క్రీడల నిర్వహణకు నిధులు పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. 127 కోట్ల జనాభా గల భారతదేశం ఒలంపిక్స్‌లో కేవలం రెండు పతకాలు మాత్రమే సాధించడం విచారకరమన్నారు. మరో అతిథి మిర్చియార్డు మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ పాఠశాలలో ర్యాంకులు, మార్కులకు ఇస్తున్న ప్రాధాన్యత వ్యాయామ విద్యకు కల్పించడం లేదన్నారు. అధిక సంఖ్యలో తల్లిదండ్రులు పిల్లలను రాష్టస్థ్రాయి టెన్నిస్ పోటీలకు తీసుకురావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో స్కూల్‌గేమ్స్ రాష్ట్ర కార్యదర్శి మహబూబ్ బాషా, శ్రీ సహస్ర క్లినిక్ అధినేత డాక్టర్ మామిళ్లపల్లి శివకుమార్, డిఎస్‌డిఒ శివకుమార్, ఎన్‌టిఆర్ స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు, జిల్లా స్కూల్‌గేమ్స్ కార్యదర్శి గణేష్, సంపత్‌కుమార్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

శివనామ స్మరణతో మార్మోగిన అమరేశ్వరాలయం
అమరావతి, నవంబర్ 7: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో కార్తీక సోమవారం సందర్భంగా అమరేశ్వరాలయం భక్తుల శివనామస్మరణతో మార్మోగింది. తెల్లవారుజామున 4 గంటల నుండే దూర ప్రాంతాల నుంచి భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. నదిలో నీరు తక్కువగా ఉండటంతో మరికొంత మంది తుంపర్ల స్నానం చేశారు. అనంతరం బాలచాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామివార్ల దర్శనం కోసం బారులు తీరారు. ఆలయ ప్రాంగణంలో, కృష్ణానది ఒడ్డున మహిళలు కార్తీక దీపాలు వెలిగించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. ఇలావుండగా కార్తీక సోమవారం సందర్భంగా అమరేశ్వరాలయంలో ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తుల సౌకర్యం దృష్ట్యా ఉత్తరపు ద్వారాన్ని తెరిచి ఉంచాలని ఆదేశించారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి శని, ఆది, సోమ వారాల్లో అదనపు బస్సులు నడపాలని కోరారు. ఈనెల 14వ తేదీన అమరేశ్వర స్వామి వారి సన్నిధిలో మహారుద్రాభిషేకానికి అవసరమైన ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఆలయ అధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు పెనుముచ్చు రామకృష్ణ, షేక్ మాబు సుభాని, షేక్ అల్లాభక్షు, కె వసంతరావు తదితరులు పాల్గొన్నారు.