గుంటూరు

అమరేశ్వర దేవస్థానం గర్భాలయ ముఖద్వారానికి బంగారు తాపడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 2: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి అమరేశ్వరస్వామి దేవస్థానంలో గర్భగుడి ముఖద్వారానికి 12.72 లక్షల రూపాయలు వెచ్చించి 360 గ్రాముల బంగారంతో బంగారపు తాపడం (గోల్డ్ కోటింగ్) చేయించడానికి ఎన్నారై మెడికల్ కళాశాల వైద్యాధికారిణి డాక్టర్ వడ్లమూడి శ్రీలత చెక్కును ఆలయ అధికారి శ్రీనివాసరెడ్డికి శనివారం అందజేశారు. అమరేశ్వరస్వామిపై ఉన్న భక్తితో ఆలయ అధికారుల సూచన మేరకు చెక్కును అందజేసినట్లు తెలిపారు. మద్రాసుకు చెందిన స్మార్ట్ క్రియేషన్ సంస్థ నిర్వాహకులు సుమారు 45 రోజుల్లో కాపర్ షీట్‌పై గోల్డ్ కోటింగ్ వేసి ముఖద్వారానికి అమర్వే విధంగా ఏర్పాట్లు చేసినట్లు డాక్టర్ శ్రీలత తెలిపారు. ఆమె పేరిట బాలచాముండికా అమరేశ్వరస్వామి వార్లకు ప్రత్యేక పూజలు జరిపించి స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేశారు.

పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
మంగళగిరి, జనవరి 2: పేదప్రజల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి అన్నారు. జన్మభూమి - మావూరు మూడోవిడత కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 1,2,3,17,18,19 వార్డుల్లోను, రూరల్ మండలంలోని ఆత్మకూరు, చినవడ్లపూడి, పెదవడ్లపూడి గ్రామాల్లో శనివారం సభలు నిర్వహించారు. ఆయా సభల్లో చిరంజీవి ప్రసంగించారు. పట్టణంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం కింద గృహనిర్మాణానికి మహిళలు పెద్దసంఖ్యలో దరఖాస్తులు అందజేశారు. పెన్షన్లు, రేషన్‌కార్డులను అందజేశారు. మున్సిపల్ కమిషనర్ టివి రంగారావు, డీఈ ఎన్ బ్రహ్మానందం, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. రూరల్ మండలంలోని గ్రామాల్లో స్ర్తి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ నిర్మల, జడ్‌పిటిసి మెంబర్ ఆకుల జయసత్య, మార్కెట్‌యార్డు చైర్మన్ ఆరుద్ర భూలక్ష్మి, వైస్‌చైర్మన్ మనె్నం రమేష్‌బాబు, సర్పంచ్‌లు వింజమూరి జ్యోత్స్న, చిట్టిబొమ్మ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ విజయలక్ష్మి, ఎంపిడిఓ పద్మావతి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

’సాయిబాబాపై కేసులు ఎత్తివేయాలి‘
గుంటూరు (పట్నంబజారు), జనవరి 2: ఢిల్లీ విశ్వవిద్యాలయ కళాశాలలో అధ్యాపకుడు డాక్టర్ జిఎస్ సాయిబాబాపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. శనివారం స్థానిక లాడ్జిసెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ధర్నాలో సీనియర్ న్యాయవాది వైకె మాట్లాడుతూ సాయిబాబాకు ముంబై హైకోర్టు ఇచ్చిన బెయిల్ పరిమితిని రద్దుచేస్తూ నాగపూర్ హైకోర్టు గత ఏడాది డిసెంబర్ 23వ తేదీన ఆదేశించడం సరికాదన్నారు. అనారోగ్య కారణాలపై గత ఏడాది డిసెంబర్ 30 వరకు తాత్కాలిక బెయిల్‌ను ముంబై హైకోర్టు మంజూరు చేసిందన్నారు. 90 శాతం అంగవైకల్యం ఉన్న సాయిబాబాకు వైద్య సేవలు అందించాల్సిన అవసరముందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహజ వనరులను బడా కంపెనీలకు ధారాదత్తం చేసే క్రమంలో గ్రీన్ హంట్‌కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సాయిబాబాను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. సాయిబాబాపై అన్ని కేసులను బేషరతుగా ఎత్తివేయాలన్నారు. ఈ ధర్నాలో ప్రజాసంఘాల నాయకులు ఎం సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, జి ప్రభుదాస్, విజయభాస్కరరావు, సంగ్రామ్, ఉన్నవ నాగేశ్వరరావు, ఉగ్గం సాంబశివరావు, నల్లపాటి రామారావు, వై వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.