గుంటూరు

వడ్లమూడి సంగం డెయిరీలో రేపు సిఎం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేబ్రోలు, జనవరి 2: వడ్లమూడి సంగం డెయిరీని ఈనెల 4వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే శనివారం సిఎం సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబునాయుడు సుమారు 15 కోట్ల రూపాయలతో ఏర్పాటుచేసిన ధూళిపాళ్ల వీరయ్యచౌదరి కల్చర్డ్ మిల్క్ బ్లాక్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం పాల ఉత్పత్తిదారులు, రైతులతో చంద్రబాబు ముఖాముఖిగా మాట్లాడతారు. సిఎం పర్యటనకు జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. కల్చర్డ్ మిల్క్ ప్రోడక్ట్ ప్రారంభంతో పాటుగా పోషక విలువలు కల్గిన సంగం దాణా, మినరల్ వాటర్ మిక్చర్‌ను మార్కెట్‌లోకి చంద్రబాబు విడుదల చేయనున్నారు. ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను సిఎం బహిరంగ సభ ఏర్పాట్లపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డిఆర్‌ఒ నాగబాబు, తెనాలి ఆర్‌డిఒ నరసింహులు, గుంటూరు సౌత్ డిఎస్‌పి శ్రీనివాసరావు, జెడ్పీ సిఇఒ సుబ్బారావు, చేబ్రోలు ఎండిఒ జోసఫ్‌కుమార్ తదితరులున్నారు.