గుంటూరు

అతిసార పూర్తిగా తగ్గుముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 22: నగరంలో అతిసార పూర్తిగా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని మంత్రులు పి నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. గురువారం నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకేష్ బి లత్కర్‌తో కలిసి సంగడిగుంట, రెడ్లబజారు, ఆనందపేట ప్రాంతాల్లో మంత్రులు పర్యటించి జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ అతిసార తగ్గుముఖం పట్టిందని, ఏవరైనా అనారోగ్యం పాలైతే అవి నీటి కాలుష్యం వల్ల వచ్చింది కాదన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అతిసార ప్రభావిత ప్రాంతంలో ప్రతిరోజూ పర్యటిస్తున్నామన్నారు. పైపులైన్ల పనులు కూడా యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. అలాగే ప్రత్యేక పారిశుద్ధ్య పనులను నిర్వహించేందుకు రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల నుండి పారిశుద్ధ్య కార్మికులు పాల్గొంటున్నారన్నారు. సైడ్‌కాల్వల్లో ఉన్న మంచినీటి కొళాయిలను షిఫ్టింగ్ చేస్తున్నామన్నారు. సైడ్ కాల్వల్లో ఉన్న మంచినీటి కొళాయిలు గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోనే కాకుండా రాష్ట్రంలో ఏ పురపాలక సంఘంలో ఉన్నా వాటిని షిఫ్టింగ్ చేస్తున్నామన్నారు. అంతేకాకుండా మంచినీటి పైపులైన్లను కూడా వంద కిలోమీటర్ల మేర మారుస్తున్నామని, ఈ నెలాఖరు నాటికి ఆనందపేట ఏరియాలో 22 కిలోమీటర్ల పరిధిలో పైపులైన్లను మారుస్తున్నట్లు వెల్లడించారు. మంత్రుల వెంట మార్కెట్‌యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, టీడీపీ నాయకులు మద్దాళి గిరిధర్, నగరపాలక సంస్థ ఎస్‌ఇ డి మరియన్న, ఇఇలు బి రామ్‌నాయక్, నగేష్‌బాబు తదితరులున్నారు.

కమాండ్ కంట్రోల్‌తో అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట
* స్పీకర్ కోడెల
గుంటూరు, మార్చి 22: శాసనసభ, సచివాలయ ప్రాంతాల భద్రత కోసం ఏర్పాటుచేసిన గరుడ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను గురువారం శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు సందర్శించారు. కంట్రోల్ రూమ్ పరిధిలో సీసీ కెమేరాల పనితీరును నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఇలాంటి సీసీ కెమేరాల వ్యవస్థ రాష్టవ్య్రాప్తంగా ఉంటే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. ద్రోణ్ కెమేరాల పనితీరు బాగుందని, ఉపగ్రహ వ్యవస్థను వినియోగించుకుంటే మరింత మెరుగైన సేవలు అందించే వీలు కలుగుతుందన్నారు. టెక్నాలజీ వినియోగంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్లే ఏపీ నెంబర్-1 స్థానంలో ఉందన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్వహణ గురించి రూరల్ ఎస్‌పి వెంకటప్పల నాయుడు స్పీకర్‌కు వివరించారు. కంట్రోల్ రూమ్ పనితీరు అద్భుతంగా ఉందని స్పీకర్ కొనియాడారు.

ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం తోడ్పాటు
పొన్నూరు, మార్చి 22: ప్రధాని ఆవాస్ యోజన, ఎన్‌టిఆర్ గృహకల్ప పథకాల ద్వారా రాష్ట్రంలోని పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశేష తోడ్పాటునందిస్తున్నాయని గృహనిర్మాణ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్ నాగశివరావు పేర్కొన్నారు. గురువారం పొన్నూరులో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గృహాలు నిర్మించుకునేందుకు ప్రభుత్వం భారీగా సబ్సిడీ అందజేస్తుందన్నారు. పిఎంఇవై పథకం ద్వారా 2016-17 సంవత్సరానికి 3,015 గృహాలు మంజూరు కాగా 2,219 ఇళ్లు నిర్మించడం జరిగిందన్నారు. 2017-18 సంవత్సరానికి 9,190 గృహాలు మంజూరు కాగా 975 నిర్మించారని, మిగిలినవి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. ఎన్‌టిఆర్ గృహాలు 2016-17 సంవత్సరానికి 18,400 మంజూరు కాగా 13,738 నిర్మాణం పూర్తయిందన్నారు. 2017-18 సంవత్సరానికి 18,800 మంజూరు కాగా 4,234 నిర్మించినట్లు తెలిపారు. 2018-19 సంవత్సరానికి 16,650 ఇళ్లు మంజూరయ్యాయని, వాటిలో 748 ఇళ్లు పూర్తయ్యాయని, మిగిలినవి కూడా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నారు. గృహాలు నిర్మించుకునే వారికి ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటునందిస్తుందని, అందరికీ ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాగశివరావు సూచించారు.