గుంటూరు

ప్రత్యేక హోదాకోసం జాతీయ రహదారిపై రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, మార్చి 22: రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు కోసం గురువారం 16వ నెంబర్ జాతీయ రహదారిపై కుంచనపల్లి, చినకాకానిల వద్ద వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, జనసేన పార్టీల ఆధ్వర్యాన రాస్తారోకో నిర్వహించారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఆయా పార్టీలు జాతీయ రహదారుల దిగ్బంధనానికి మద్దతు ప్రకటించాయి. కుంచనపల్లి వద్ద మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి కృష్ణయ్య, సీపీఐ నాయకులు కంచర్ల కాశయ్య తదితరులు బైఠాయించి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు జరిపే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని, ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరించిన వైఖరి ఫలితంగానే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే ఆర్కే ధ్వజమెత్తారు. చినకాకాని క్యాన్సర్ ఆస్పత్రి వద్ద జాతీయ రహదారిపై గంటసేపు బైఠాయించి వాహనాలు నిలిపి వేశారు. వామపక్షాల నేతలు జేవీ రాఘవులు, వై గంగాధరరావు, పి బాలకృష్ణ, చిన్ని తిరుపతయ్య, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు జంజనం భిక్షారావు, షేక్ సలీం, జొన్నాదుల జ్యోతి, రవికాంత్, పూర్ణచంద్రరావు, కుబేరస్వామి తదితరుల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాలను నిలిపి వేశారు. ప్రత్యేక హోదా సాధించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని నాయకులు స్పష్టంచేశారు. జేవీ రాఘవులు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో ద్రోహం చేసిందని, పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం కూడా చర్చకు రాకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. జాతీయ రహదారికి ఇరువైపులా పెద్దసంఖ్యలో వాహనాలు నిలిపి పోయాయి.
రాస్తారోకోలో చిక్కుకున్న జగన్ చినకాకాని వద్ద జాతీయ రహదారిపై పార్టీల నాయకులు, కార్యకర్తలు బైఠాయించడంతో దాదాపు రెండు కీమీ వరకు వాహనాలు నిలిచి పోయాయి. చిలకలూరిపేట నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తున్న వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి కాన్వాయ్ కూడా నిలిచి పోయిన వాహనాల్లో చిక్కుకుంది. రాస్తారోకో విరమించాక జగన్ కాన్వాయ్ గన్నవరం వైపు దూసుకెళ్లింది.

అందరి సహకారంతో నగరాభివృద్ధి
* అభివృద్ధి పనులకు ప్రాధాన్యత
* బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ శ్రీకేష్ బి లత్కర్
గుంటూరు, మార్చి 22: గుంటూరు నగరాన్ని అందరి సహకారంతో అభివృద్ధి చేస్తానని నగరపాలక సంస్థ నూతన కమిషనర్ శ్రీకేష్ బి లత్కర్ పేర్కొన్నారు. గురువారం ఆయన ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక విలేఖర్లతో కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామన్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు, యుజిడి పనులు నగర సుందరీకరణ, రోడ్ల విస్తరణ తదితర పనులు ప్రాధాన్యతా క్రమంలో చేసేందుకు దృష్టి సారిస్తామన్నారు. సీఎం చంద్రబాబు గుంటూరు నగరాభివృద్ధికి సహకరిస్తున్నారన్నారు. ఇటీవల చోటు చేసుకున్న అతిసార సంఘటనపై స్పందిస్తూ ఘటనకు సంబంధించిన కారణాలను గుర్తించి వివిధ శాఖల సమన్వయంతో ఆయా ప్రాంతాల్లో వైద్యసేవలతో పాటు పారిశుద్ధ్య మెరుగుదలకు స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు. అతిసార ప్రభావిత ప్రాంతాల్లో అనారోగ్య వాతావరణం నుంచి ఆరోగ్య వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. నగరంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా డ్రైన్లలో ఉన్న మంచినీటి కొళాయిలను షిఫ్ట్ చేస్తున్నామన్నారు. అలాగే పాత పైపులైన్ల స్థానంలో 22 కిలోమీటర్ల మేర 15 రోజుల్లో నూతన పైపులైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మిగిలిన ఆరు వార్డుల్లో 100 కిలోమీటర్ల పరిధిలో పైపులైన్ల ఏర్పాటు 45 రోజుల్లో పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. నగరపాలక సంస్థ పంపింగ్ కేంద్రాల నుండి నగరానికి 100 ఎంఎల్‌డి మంచినీటిని సరఫరా చేస్తున్నామని, ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన సమగ్ర తాగునీటి పథకం నెల రోజుల్లో పూర్తిచేసి అదనంగా 45 ఎం ఎల్‌డి వాటర్‌ను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వేసవిలో నగరానికి నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టామన్నారు. అలాగే 25 పాత రిజర్వాయర్లతో పాటు 18 నూతన రిజర్వాయర్లను పూర్తి చేయడం జరిగిందన్నారు. నూతన రిజర్వాయర్లకు అనుసంధాన పనులను త్వరితగతిన పూర్తిచేసి వినియోగంలోకి తెస్తామన్నారు. నగరంలో చేపట్టిన యుజిడి పనుల వలన రోడ్ల తవ్వకంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సంబంధిత గుత్తేదారులతో పాటు అధికారులతో సమావేశం నిర్వహించి రోడ్ల పునరుద్దరణకు చర్యలు గైకొంటామన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉన్నట్లు గుర్తించామని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమస్యలను అధిగమించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నగర అదనపు కమిషనర్ కె రామచంద్రారెడ్డి, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, సిటీప్లానర్ చక్రపాణి, ఎగ్జామినర్ ఆఫ్ ఎకౌంట్స్ చిన్నపరెడ్డి, మేనేజర్ వెంకట్రామయ్య, ఏసిపి ఎం హర్జానాయక్, ఆర్‌ఒలు ఎస్‌ఎన్ ప్రసాద్, వేణుబాబు, ఎ శంకరరావు, నర్సిరెడ్డి, నగరపాలక సంస్థ మినీస్టీరియల్ సిబ్బంది తదితరులు కమిషనర్‌ను కలిసి అభినందనలు తెలిపారు.