గుంటూరు

ప్రధానికి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), మార్చి 22: భారతదేశ ప్రధానికి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదని గుంటూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ మన్నవ సుబ్బారావు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలను కేంద్రం అమలు చేయనందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ, వాసవీక్లబ్ ఆధ్వర్యంలో గురువారం శాంతియుత నిరసన, ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా మన్నవ మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానంపై చర్చకు రానీయకుండా ఉభయ సభల్లో అడ్డు పడుతున్నారన్నారు. సభలో చర్చ జరిగితే తమ పరువుకు భంగం కలుగుతుందని కేంద్రం భయపడుతుందన్నారు. విభజన చట్టం హామీలు, హక్కులను నాలుగు బడ్జెట్‌లలో పట్టించుకోలేదని, ఇది రాష్ట్ర ప్రజల పట్ల వివక్ష చూపడమేనన్నారు. కేంద్రం కక్ష్యసాధింపునకు పాల్పడితే ప్రజలు కాంగ్రెస్‌కు చెప్పిన గుణపాఠమే బీజేపీకి చెప్తారన్నారు. ఆస్తుల, అప్పుల విభజనలో, విద్యుత్ పంపిణీలో, పన్నుల వసూలు, తిరిగి చెల్లింపుల్లో రాష్ట్రానికి నష్టం వాటిల్లిందన్నారు. ప్రత్యేక హోదా సహా మిగిలిన హామీలను వెంటనే అమలు చేయాలని టీడీపీ ప్రభుత్వం ఆంతరంగీక పోరాటం చేసిందన్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి షేక్ లాల్‌వజీర్, తెలుగుయువత మాజీ అధ్యక్షుడు మనె్నం శివనాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇవ్వకుంటే బీజేపీని ప్రజలు క్షమించరన్నారు. కార్యక్రమంలో దారపనేని నరేంద్ర, గోళ్ల ప్రభాకర్, బి రాజేంద్ర, వై బుచ్చిబాబు, సంధ్య, కమల, అమరనాథ్ తదితరులు పాల్గొన్నారు.

జగన్ పాదయాత్రను విజయవంతం చేయాలి
అమరావతి, మార్చి 22: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం చేపట్టి ప్రజా సంకల్ప యాత్ర జిల్లాలో సాగుతుందని, మరో రెండు, మూడు రోజుల్లో పెదకూరపాడు నియోజకవర్గంలో జరగనున్న జగన్ పాదయాత్రను విజయవంతం చేయాలని పెదకూరపాడు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. గురువారం వైసీపీ బూత్ కమిటీ సభ్యులు, నాయకుల సమావేశం జరిగింది. సమావేశానికి మండల అధ్యక్షుడు మంగిశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైఎస్‌ఆర్ సీపీ కృషి చేస్తుందన్నారు. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నాయకులు హోదా వద్దు, ప్యాకేజీయే ముద్దు అంటూ ప్యాకేజీ కోసం పాకులాడి లెక్కలు చెప్పడం లేదంటూ ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించక పోవడంతో యు-టర్న్ తీసుకుని ప్రత్యేక హోదా సాధన కోసం జిమ్మిక్కులు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా తెలుగుదేశం, బీజేపీ నాయకులు డ్రామాలు ఆడటం మానుకుని రాష్ట్భ్రావృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వెంజా జ్వాలా లక్ష్మీనరసింహారావు, భవిరిశెట్టి హనుమంతరావు, మేకల హనుమంతురావు యాదవ్, సిహెచ్ ఉమామహేశ్వరరావు, శ్రీకాంత్‌తో పాటు మండల పరిధి గ్రామాల నుండి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.