గుంటూరు

హోదా సాధించే వరకు ఉద్యమం ఉద్ధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), మార్చి 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోరుతూ గురువారం మిర్చియార్డు వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక మోసపూరిత మాటలు చెప్తూ కాలం వెళ్లదీస్తోందని, ఇప్పటికైనా హోదా కల్పించాలని లేకుంటే రాష్టవ్య్రాప్తంగా ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రధాని నరేంద్రమోదీ మోసం చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హోదాను పట్టించుకోకుండా రాజధాని నిర్మాణం పేరుతో డిజైన్లకే పరిమితమయ్యారని, పాలనలో వైఫల్యం చెందారని ధ్వజమెత్తారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నిర్మించలేక పోయినప్పటికీ డిజైన్ల పేరుతో డబ్బును దుబారా చేస్తూ హోదా ఊసు మరిచారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అఖిలపక్ష, వామపక్షాలు చేస్తున్న హోదా ఆందోళనకు మద్దతునిచ్చి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని విజ్ఞప్తిచేశారు. సీపీఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదాకు అడ్డుపడుతున్న దుష్టశక్తులను నివారించి, బీజేపీ మెడలు వంచైనా సరే హోదా సాధించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ చట్టాలను అపహాస్యం చేయడం మోదీ, చంద్రబాబులకు వెన్నతో పెట్టిన విద్య అని, ప్రజా పోరాటాల ముందు ఏంతటి వారైనా తలొగ్గక తప్పదన్నారు. ప్రత్యేక హోదా కోసం రోడ్లపైకి వస్తుంటే అరెస్ట్‌లు చేయడం దారుణమన్నారు. జాతీయ రహదారి దిగ్బంధం చేసిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ప్రత్యేక హోదా సాధన సమితి జిల్లా అధ్యక్షుడు పివి మల్లిఖార్జునరావు, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుగూరి రాధాకృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి, ఆయా పార్టీల నాయకులు వణుకూరి శ్రీనివాసరెడ్డి, సవరం రోహిత్, బిట్రగుంట మల్లిక, కనకరాజు ప్రసాద్, పులి సాంబశివరావు, నూతలపాటి చిన్న, అమీర్‌వలి, కుమార్‌నాయక్, బి వెంకటేశ్వరరెడ్డి, గోవిందు, వలి, టి నరసింహారావు, ఎ హరి తదితరులు పాల్గొన్నారు.

గుంటూరు బార్ ఎన్నికల పోరులో నిలిచింది వీరే
* ఓటు హక్కు వినియోగించుకోనున్న 2038 మంది న్యాయవాదులు
* కెమెరాల నిఘాలోనే ఎన్నికలు
* గుర్తింపుకార్డులు తప్పనిసరి
గుంటూరు (లీగల్), మార్చి 22: రాష్ట్రంలోనే అత్యంత పెద్ద బార్ అసోసియేషన్‌గా పేర్గాంచిన గుంటూరు బార్ అసోసియేషన్‌కు 2018-19 సంవత్సరానికి జరగనున్న ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొంది. ఈనెల 29వ తేదీన జరగనున్న ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులను ప్రస్తుత బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి ఉమామహేశ్వరరావు గురువారం ప్రకటించారు. అధ్యక్ష పదవికి సీనియర్ న్యాయవాదులు మల్లవరపు శేఖర్‌బాబు, మంగళపూరి శ్రీనివాసరావు, పోలూరి వెంకటరెడ్డిలతో త్రిముఖ పోటీ నెలకొంది. ఉపాధ్యక్ష పదవికి గత ఏడాది పరాజయం పొందిన కవిపురపు పట్ట్భారాముడుతో గతంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన దాసరి శ్రీనివాసరావు పోటీపడుతున్నారు. ప్రధాన కార్యదర్శి పదవికి పసుమర్తి అంకమ్మరావు, సింగపోగు బేబీ అన్నపూర్ణ ఝాన్సీ, మోటుపల్లి జయశంకర్ బరిలోకి దిగారు. కోశాధికారి పదవికి జమ్మిగుంపుల మాధవరావు, పిన్నమనేని రామచంద్రరావు బరిలోకి దిగగా, మహిళా ప్రతినిధి పదవికి ఆకుల జ్యోత్స్న, రాయన సత్యవేదం పోటీ పడుతున్నారు. మూడు జూనియర్ కార్యవర్గ సభ్యుల పదవులకు మొత్తం ఏడుగురు న్యాయవాదులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం కార్యవర్గ సభ్యుడిగా ఉన్న రావిడి కాంతారావుతో పాటు వీరగాని లీలాకృష్ణ, గువటా సాయిచంద్ర, గండికోట శేషగిరిరావు, షేక్ ఉమర్‌బాషా, అవుతు వీరారెడ్డి, పి ఏసుప్రసాద్ తలపడనున్నారు. ఇలా ఉండగా సంయుక్త కార్యదర్శి పదవికి మొండితోక శ్రీనివాసరావు, గ్రంథాలయ కార్యదర్శి పదవికి జమ్ముల లక్ష్మీకాంత్, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల కార్యదర్శి పదవికి బూదాటి సాగర్, మహిళా కార్యవర్గ సభ్యురాలి పదవికి మిడియంపల్లి లక్ష్మీదేవిలతో పాటు నాలుగు సీనియర్ కార్యవర్గ సభ్యుల పదవులకు ఆకుల లక్ష్మీసుజాత, జమ్ముల మురళీధర్, సిద్దా సత్యనారాయణ, కోటంరాజు శ్రీనివాసరావు మాత్రమే పోటీపడటంతో వీరి పదవులు ఏకగ్రీవమయ్యాయి. 29వ తేదీ ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే ఎన్నికలను సాయంత్రం 4 గంటలకు ముగిస్తామని, ప్రతి అభ్యర్థి ఓటును అతి రహస్యంగా, పారదర్శకంగా వినియోగించుకోవాల్సి ఉంటుందని, వారి గుర్తింపుకార్డులు తప్పనిసరిగా తెచ్చుకోవాలని అధ్యక్షుడు దాసరి ఉమామహేశ్వరరావు వివరించారు.

అవిశ్వాస తీర్మానంపై చర్చ బాధ్యత కేంద్రానిదే
గుంటూరు (పట్నంబజారు), మార్చి 22: కేంద్రబడ్జెట్‌తో సహా చాలా బిల్లులను గందరగోళంలో సైతం ఆమోదింపజేసుకున్న ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంపై చర్చకు తగు వాతావరణం లేదనడం హాస్యాస్పదమని అవగాహన సంస్థ ఆధ్వర్యంలో జరిగిన చర్చాగోష్టిలో పాల్గొన్న మేధావులు, వివిధ సంఘాల నాయకులు అన్నారు. గురువారం అరండల్‌పేటలోని సంస్థ కార్యాలయంలో సంచలనం సృష్టిస్తున్న అవిశ్వాస తీర్మానం అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠికి విశ్రాంత ఉపాధ్యాయుడు టి రామాంజనేయ సూరి అధ్యక్షత వహించారు. చర్చను ప్రారంభించిన రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకుడు, న్యాయవాది ఎ హరి మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రభుత్వంపై ఏకకాలంలో సంధించిన రెండు అవిశ్వాస తీర్మానాలు సంచలనం సృష్టిస్తున్నాయని, మూడున్నరేళ్లుగా అప్రతిహాతంగా దూసుకెళ్తున్న మోదీ ఏకంగా రెండు అవిశ్వాస తీర్మానాలేమిటని దేశ ప్రజలు చర్చించుకుంటున్నారు. విద్యావేత్త కె శ్రీమన్నారాయణ మాట్లాడుతూ అవిశ్వాస భవితవ్యం తేల్చకుండా పార్లమెంటును నిరవధికంగా వాయిదా వేస్తే మోదీ పలాయనం చిత్తగించారన్న అపనింద రావడం ఖాయమన్నారు. కేంద్రం తలచుకుంటే సభలో దేన్నైనా, ఏ రూపంలోనైనా, ఎలాగైనా ప్రవేశ పెట్టేలా చేయగలదని, వాటి గమ్యాన్ని నిర్ధేశించగలదన్నది అందరికీ తెలిసిన బహిరంగ సత్యమేనన్నారు. అధ్యాపకులు సిహెచ్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఆ తీర్మానాలను కూడా ప్రభుత్వమే చొరవ తీసుకుని చర్చకు వచ్చేలా చేస్తే ప్రతిపక్షాల పంతం నెగ్గినట్లు అని భావించకుండా మెజార్టీ ఉన్న పాలకపక్షం ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. ఈ చర్చాగోష్ఠిలో పిఎస్ మూర్తి, సింగరయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్య
కాకుమాను, మార్చి 22: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గుణాత్మక విద్య లభిస్తుందని ఎంఇఒ కెఎఫ్ కెనడి అన్నారు. మండల పరిధిలోని కొమ్మూరు స్పెషల్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ సభకు గురువారం కెనడి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఒత్తిడిలేని, నైతిక విలువలతో కూడిన విద్య అందుతుందన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం అందజేస్తున్న యూనిఫారం, ఉపకార వేతనాల ద్వారా లబ్ధి పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా పాఠశాలల్లోని చిన్నారులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం గేరా మోహనరావు, ఎస్‌ఎంసి ఛైర్‌పర్సన్ చల్లా అనూష, సర్పంచ్ కొల్లా సాంబ్రాజ్యం, సిఆర్‌పి జయమ్మ తదితరులు పాల్గొన్నారు.