గుంటూరు

చోరీ కేసుల్లో నిందితుడి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, మార్చి 24: పగలు వంటమేస్ర్తీగా పనిచేస్తూ రాత్రివేళల్లో దేవాలయాల్లో, చర్చిల్లో దొంగతనాలకు పాల్పడుతున్న మంగళగిరి మండలం నవులూరు గ్రామంలోని ఉడా కాలనీకి చెందిన షేక్ నాగుల్‌మీరా అలియాస్ సన్ను అనే యువకుడిని అరెస్ట్‌చేసి అతన్నుంచి 2.61 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు నార్త్‌జోన్ డిఎస్పీ గోగినేని రామాంజనేయులు వెల్లడించారు. మంగళగిరి రూరల్ పోలీసుస్టేషనులో శనివారం సీఐ ఎం మధుసూదనరావు, ఎస్సై వినోద్‌లతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో నిందితుడ్ని, స్వాధీనం చేసుకున్న చోరీసొత్తును చూపి కేసు వివరాలను డీఎస్పీ రామాంజనేయులు వెల్లడించారు. మంగళగిరి మండలం కాజ సాయిబాబా గుడిలోను, నీరుకొండ, నవులూరు గ్రామాల్లోని ఆలయాలు, చర్చిల్లోను, మంగళగిరి పట్టణంలోను, పెదకాకాని మండలం నంబూరు, తక్కెళ్లపాడు గ్రామాల్లోను, తాడికొండ మండలం రావెల గ్రామంలోను, తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామాల్లోను నాగుల్‌మీరా గతకొంతకాలంగా దేవాలయాలు, చర్చిలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదుతో నాగుల్‌మీరాను అరెస్ట్ చేసి బంగారు, వెండి ఆభరణాలతో పాటు 10 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రామాంజనేయులు వివరించారు. ఎఎస్సై రమేష్, హెడ్‌కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుళ్లు కోటేశ్వరరావు, మేరీ తదితరులు నాగుల్‌మీరా అరెస్ట్‌కు సహకరించారని డిఎస్పీ తెలిపారు.