గుంటూరు

చేతివృత్తి కళాకారులను ప్రోత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), మార్చి 24: చేతివృత్తి కళాకారులను ఆదరించి ప్రోత్సహించాలని గుంటూరు మార్కెట్‌యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు పేర్కొన్నారు. శనివారం స్థానిక మహిమాగార్డెన్స్‌లో కళాంజలి ఆర్ట్స్ అండ్ క్రాప్ ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో న్యూ క్రాఫ్ట్ ఇండియా క్రాఫ్ట్ బజార్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ హస్తకళలు అంతరించిపోతున్నాయని, వీటిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న చేనేత, హస్తకళా ప్రదర్శనలను ప్రజలు ఆదరించాలన్నారు. రాష్ట్ర హస్తకళల డైరెక్టర్ వట్టికూటి హర్షవర్ధన్ మాట్లాడుతూ చేనేత, హస్తకళల ఎగ్జిబిషన్‌లో చేనేత వస్త్రాలతో పాటు ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, హైదరాబాద్ ముత్యాలు, లెదర్ వస్తువులతో పాటు ఇమిటేషన్ జ్యూయలరీ ప్రదర్శనలో ఏర్పాటు చేశారన్నారు. ప్రదర్శన నిర్వాహకులు ఎండి పాషా, ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ ఈనెల 24 నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చిగురుపాటి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగులు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలి
గుంటూరు (పట్నంబజారు), మార్చి 24: విద్యనభ్యసించి ఉద్యోగాలు లభించక నిరుద్యోగులుగా ఉన్న యువత క్రీడల వైపు దృష్టిసారించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని డిఆర్‌డిఎ ఏపిడి మహిత సూచించారు. గోరంట్లలోని శ్రీ టెక్నాలజీస్‌లో దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకంలో శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువత ఇటీవల ఒంగోలులో యువజన సంక్షేమ శాఖ రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్టస్థ్రాయి యువజనోత్సవాల పోటీల్లో బహుమతులు సాధించారు. శనివారం జరిగిన అభినందన కార్యక్రమంలో ఏపిడి మహిత ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు విద్యకు ప్రాధాన్యతనిస్తూ అత్యధికంగా నిధులు కేటాయిస్తున్నాయన్నారు. సెంటర్ ఫెడ్ సతీష్, డైరెక్టర్లు ఈశ్వరరావు, వెంకటేష్ మాట్లాడుతూ యువజనోత్సవాల్లో వివిధ పోటీల్లో పాల్గొని శిక్షితులు తమ సత్తాచాటారన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ జెడిఎం సుమలత, శ్రీ టెక్నాలజీస్ స్టేట్ హెడ్ సత్యం, సుభాని తదితరులు పాల్గొన్నారు.

తుది శ్వాస వరకు పేదల పక్షపాతిగా గురవయ్య
* సీపీఐ నేత ముప్పాళ్ల
సత్తెనపత్లి, మార్చి 24: నమ్మిన సిద్ధాంతాల కోసం చివరి రక్తపు బొట్టవరకు శ్రమించిన నాయకుడు, పేదల పక్షపాతి నరిశేటి గురవయ్య అని సీపీఐ రాష్ట్ర కార్యాదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర రైతు సంఘ ఉపాధ్యక్షుడు, దూళ్లిపాళ్ళ ఆంధ్రా బ్యాంక్ రైతు సేవ సహకార సంఘ చైర్మన్ నరిశేటి గురవయ్య సంస్మరణ సభ శనివారం స్థానిక కాకతీయ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సభకు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ అధ్యక్షత వహించారు. పట్టణంలోని చెంచుకాలని, యానిదికాలని, లెనిన్ నగర్‌లు ఉన్నంతకాలం గురవయ్య ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని ముప్పాళ్ల అన్నారు. గురవయ్య, సతీమణి లక్ష్మీనరసమ్మ మృతి కమ్యూనిస్టూ పార్టీకి తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ యువనాయకుడు కోడెల శివరామ్ హాజరై గురవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సంస్మరణ సభలో ఏఐకెఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు గని, కాంగ్రెపార్టీ మాజీ శాసన సభ్యులు యర్రం వెంకటేశ్వరరెడ్డి, నాయకులు పక్కాల సూరిబాబు, మున్సిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి, మార్కెట్ యార్డు చైర్మన్ పెద్దకరిముల్లా, వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు అభిమానులు గురవయ్య సేవలను కొనియాడారు.