గుంటూరు

అతిసార బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 24: అతిసార బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొన్నారు. శనివారం తూర్పు నియోజకవర్గంలోని అతిసార ప్రభావిత ఐపిడి కాలనీ, బాలాజీనగర్‌లలో మృతుల కుటుంబ సభ్యులను టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జి మద్దాళి గిరిధర్‌తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఐపిడి కాలనీ, బాలాజీనగర్‌కు చెందిన కొలగాని పద్మావతి, అడపాల వెంకట్రావ్ కుటుంబాలకు 5 లక్షల రూపాయల చెక్కులను ఎంపీ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ జయదేవ్ మాట్లాడుతూ అతిసార ప్రబలిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారని, బాధితులకు అన్ని విధాలా వైద్య సేవలు అందించారన్నారు. నాలుగు దశాబ్దాల క్రితం గుంటూరు నగరంలో ఏర్పాటుచేసిన మంచినీటి పైపులు శిథిలావస్థలో ఉండటం వలనే లీకులు ఏర్పడి తాగునీరు కలుషితమైందన్నారు. సంఘటన జరిగిన వెంటనే మున్సిపల్ అధికారులను అప్రమత్తం చేసి మూడు రోజుల్లోనే నీటి సరఫరా పనులను పునరుద్ధరించామన్నారు. అలాగే చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షలతో పాటు చంద్రన్న బీమా కింద వచ్చే ఆర్థికసాయం కూడా అందజేస్తామన్నారు. మద్దాళి గిరిధర్ మాట్లాడుతూ నగరంలో ఇప్పటికే అతిసార అదుపులో ఉందని, కొత్తగా కేసులేవీ నమోదు కాలేదన్నారు. నగరంలోని అన్ని ముఖ్య కూడళ్లలో కూలింగ్ మినరల్ వాటర్ క్యాన్‌లను ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. అలాగే నగరం నుంచి మురుగునీరు బయటకు పంపించే సీనరేజ్ పంపింగ్ కేంద్రం వద్ద రెండు మోటార్లను వినియోగంలోకి తీసుకువచ్చి పంపింగ్ ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు షేక్ షౌకత్, గోళ్ల ప్రభాకర్, వేములపల్లి శ్రీరాం ప్రసాద్, ఈర్ల గురవయ్య, టీడీపీ నాయకులు సూరె శ్రీనివాసరావు, అల్లం బాజీ, గోగినేని వెంకటకృష్ణ, యల్లావుల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.