గుంటూరు

అంతం కాదు ఇది ఆరంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 20: ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోదీ వెంకన్నసాక్షిగా ఇచ్చిన హామీలు రాష్ట్ర విభజనతో ఏర్పడిన హక్కులు, నిధుల కేటాయింపులు, ప్రత్యేక హోదా అంశాలను కేంద్రం మెడలు వంచైనా సరే సాధిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టంచేశారు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు మద్ధతుగా జిల్లావ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌ఛార్జిల ఆధ్వర్యంలో శుక్రవారం రిలేదీక్షలు నిర్వహించారు. గుంటూరు హిందూ కళాశాల సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నిర్వహించిన దీక్షా శిబిరంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీలు ఎఎస్ రామకృష్ణ, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, పార్టీ నాయకులు రాయపాటి రంగారావు, మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ దాసరి రాజామాస్టారు, మాజీ ఎమ్మెల్సీలు రాయపాటి శ్రీనివాస్, మహ్మద్ జాని తదితరులు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా, జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు, విశాఖ రైల్వేజోన్, అమరావతి, విశాఖ మెట్రో రైలు, కడప ఉక్కు కర్మాగారం, దుగ్గరాజపట్నం పోర్టు తదితర అంశాల్లో కేంద్రం నాలుగేళ్లుగా తాత్సార్యం చేస్తోందని, రాష్ట్ర ప్రజలను నమ్మించి నట్టేట ముంచిందని విమర్శించారు. వీటికి ప్రధాన కారణం ప్రధాన మంత్రి నరేంద్రమోదీయేనని, తమిళనాడు తరహా రాజకీయాలను చేయాలనే దురుద్దేశంతో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్ష అంతం కాదని.. ఆరంభం మాత్రమేనన్నారు. రాష్టవ్య్రాప్తంగా సంఘీభావ దీక్షలకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి మద్దతిస్తున్నారని, ఇప్పటికీ కేంద్రం మేల్కొనకపోతే వచ్చే ఎన్నికల్లో నరేంద్రమోదీకి ప్రజలే బుద్ధిచెప్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుఖవాసి శ్రీనివాసరావు, వట్టికూటి హర్షవర్ధన్, కసుకుర్తి హనుమంతరావు, దారపనేని నరేంద్ర, తెలుగు మహిళా నాయకులు పోతురాజు ఉమాదేవి, నల్లపనేని విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అకాలవర్షం .. రైతు కంట కన్నీరు
అచ్చంపేట, ఏప్రిల్ 20: మండలంలో శుక్రవారం కురిసిన అకాలవర్షం రైతుల కంట నీరు తెప్పించింది. శ్రమపడి పండించిన పంట చేతికి అందే సమయంలో కురిసిన వడగండ్ల వాన నోటికాడి తిండిని లాగేసుకుంది. బలమైన ఈదురుగాలుల వలన పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. రోడ్లపైకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో చెరువులను తలపించాయి. డంపింగ్‌యార్డు పై కప్పు గాలికి ఎగిరిపోవడంతో లోపల ఉన్న ఎరువు తడిసిపోయంది. ఆరబోసిన మిరప కళ్లాల్లోకి నీరు చేరి కాయలు తడిసాయి. ఏపూరి రాంబాబుకు చెందిన మునగ తోట మొత్తం నేలకొరిగింది. ఎఇఎల్‌సి చర్చి పై అంతస్థు గోడ కూలి పక్కనున్న రేకుల ఇంటిపై పడటంతో అందులో నివాసం ఉంటున్న పల్లా సుబ్బారావు, రమణ దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొత్తానికి ఈదురుగాలులతో కురిసిన భారీవర్షంతో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా నష్టాన్ని చవిచూశారు.

హోదా సాధించే వరకు పోరాటాలు ఆగవు
అమరావతి, ఏప్రిల్ 20: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం చేపట్టిన ధర్మపోరాట దీక్షకు మద్ధతుగా మండల కేంద్రమైన అమరావతిలో ధ్యానబుద్ధ ప్రాజెక్టు వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, డ్వాక్రా మహిళలు, అంగన్‌వాడీ కార్యకర్తలు వౌనదీక్ష చేపట్టారు. అమరావతి, ధరణికోట గ్రామాలకు చెందిన సర్పంచ్ జి నిర్మలాదేవి, బేతపూడి యల్లమంద, తహశీల్దార్ భాస్కరరావు, ఎండీవో వై రాజగోపాల్, ఆయా గ్రామాల కార్యదర్శులు మోహన్‌చంద్, రమేష్, వెలుగు సీసీలు అయోధ్య రాఘవ, సతీష్‌తో పాటు ఆయా గ్రామాల డ్వాక్రా మహిళలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన దీక్ష సాయంత్రం వరకు కొనసాగింది. దీక్షా శిబిరాన్నుద్దేశించి తహశీల్దార్ భాస్కరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అవసరమని, విభజన హామీలను కేంద్రం తక్షణమే అమలు చేయాలని కోరారు. ఎండీవో రాజగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం చేస్తున్న ధర్మపోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ధర్మపోరాట దీక్షలో సుమారు 200 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.