గుంటూరు

రెండు నెలల్లో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 17: వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులు రాబోయే రెండు నెలల్లో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఆదేశించారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పనితీరుపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కారెం శివాజీ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. దేవాదాయ, మార్కెటింగ్ శాఖల పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ ఆ శాఖల పనితీరును సమగ్రంగా పరిశీలించి నివేదిక అందజేయాలని జెసిని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల పరిష్కారంలో అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలు, విచారణ విషయాల్లో జరుగుతున్న జాప్యం గురించి ఆయన మాట్లాడుతూ బాధితులకు అండగా ఉంటూ వారికి న్యాయం జరిగేలా కృషి చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీలో ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్‌ను తప్పక అమలు చేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీల కుటుంబాల సంక్షేమం కోసం కమిషన్ నిర్విరామంగా కృషి చేస్తోందన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు శ్మశాన వాటికల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఈ విషయంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆర్డీవోలను ఆదేశించారు. ప్రతి మండల కేంద్రంలో పౌరహక్కుల దినోత్సవ కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించాలని ప్రజా ప్రతినిధులు భాగస్వాములయ్యేలా కమిషన్ తగిన సూచనలు జారీచేసే అవకాశం ఉందన్నారు. తొలుత అధికారులతో వివిధ పథకాల అమలు, సిబ్బంది వివరాలపై సమీక్షించారు. కుల ధ్రువీకరణ పత్రాలపై తహశీల్దార్లతో సమీక్షించారు. అభ్యర్థులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బాధితులకు లక్ష రూపాయల పరిహారం అందించే విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసే విషయంలో డిసిసిబికి లక్ష్యాలు పెంచాలని చెప్పారు. ఎస్టీలకు ఇచ్చిన భూములను బలవంతంగా లాక్కోవాలని చూస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలంలో 7, 8 కుటుంబాలకు చెందిన భూములు కొన్నా పరిహారం చెల్లించలేదని, ఈ విషయాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల టీచర్ల నియామకంలోనూ, ఎస్సీ పిల్లలకు పోషకాలు అందించడంలోనూ ప్రాధాన్యతనివ్వాలన్నారు. షెడ్యూల్ తెగల కుటుంబాల సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థతో పాటు అన్ని మున్సిపాలిటీలలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరయ్యేలా చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల విషయంలో ఎఫ్‌ఐఆర్ ఫైల్ అయిన వెంటనే బాధితులకు పునరావాసం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి మరణించి దశాబ్దకాలం గడిచినా ఆ కుటుంబానికి పెన్షన్ మంజూరు చేయకపోవడంపై శివాజీ ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే రికార్డులను పరిశీలించి పెన్షన్ మంజూరు చేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసేందుకు అంగీకరించని బ్యాంకుల వివరాలు అందజేయాలని ఎల్‌డిఎం సుదర్శనరావును చైర్మన్ ఆదేశించారు. మంగళగిరి మున్సిపల్ కమిషనర్ సమీక్షా సమావేశానికి హాజరుకోక పోవడంపై సంజాయిషీ కోరాలని చైర్మన్ శివాజీ జెసిని ఆదేశించారు. లక్షా 24 వేల రూపాయల అవకతవకలకు పాల్పడిన ఒక గ్రామ సర్పంచ్‌కు మరలా చెక్ పవర్ ఇచ్చిన విషయంపై విచారించి నివేదిక అందజేయాలన్నారు. ఈనెల 21వ తేదీ నాటికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు సేకరించి కమిషన్ కార్యాలయానికి అందజేయాలని సాంఘిక సంక్షేమ శాఖ జెడిని ఆదేశించారు. కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల పరిష్కారంలో అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలు మీ-సేవ కేంద్రం నుండి జారీచేయబడతాయని వివరించారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు నరహరి వరప్రసాద్, బి రవీంద్ర, గుంటూరు అర్బన్, రూరల్ ఎస్‌పిలు సిహెచ్ విజయారావు, సిహెచ్ వెంకటప్పల నాయుడు, జెసిఎ ఎండి ఇంతియాజ్, డిఆర్‌ఒ కె నాగబాబు, ఎస్సీ కార్పొరేషన్ ఇడి బాలాజీనాయక్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జెడి ఆర్ మల్లిఖార్జునరావు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ
గుంటూరు (పట్నంబజారు), మే 17: ప్రజాస్వామ్యాన్ని భారతీయ జనతా పార్టీ కూనీ చేస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కర్ణాటకలో జెడిఎస్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతునిచ్చి 117 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వం చేస్తామని గవర్నర్‌కు లేఖ పంపితే పరిగణలోకి తీసుకోకుండా 104 మంది ఎమ్మెల్యేలున్న బీజేపిని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఆమోదించడాన్ని నిరసిస్తూ గురువారం కాంగ్రెస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఇందులో భాగంగా లాడ్జిసెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ఆందోళనలో నాయకులు మాట్లాడుతూ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధానమంత్రి మోదీ రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా మారారన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎడ్యూరప్ప ఒక్కరోజు ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలి పోనున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సవరం రోహిత్, వణుకూరి శ్రీనివాసరెడ్డి, ఈరి రాజశేఖర్, దొంతా సురేష్, గాలి అశోక్, బిట్రగుంట మల్లిక, అంజిబాబు, నాగరాజు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.