గుంటూరు

రాష్ట్భ్రావృద్ధిలో రాజీపడబోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, మే 18: రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధిలో ఎక్కడా రాజీపడకుండా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. మండల కేంద్రమైన అచ్చంపేట శుక్రవారం ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ ఆధ్వర్యాన జరిగిన మినీమహానాడు కార్యక్రమానికి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ దాసరి రాజామాస్టారు ఇతర జిల్లా ముఖ్యనేతలు హాజరై మాట్లాడారు. కుతంత్ర రాజకీయాలతో ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. టీడీపీ పాలనలోనే రాష్ట్భ్రావృద్ధి జరుగుతోందన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. జగన్ చేసేది ప్రజావంచన యాత్ర అన్నారు. పనిలో పనిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, జగన్మోహనరెడ్డిపై రాజకీయ ఆరోపణలు చేశారు. అంతరించిపోతున్న కులాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్‌లు ఏర్పాటుచేసి వారికి సరైన ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. బీసీలకు ఎలాంటి నష్టం లేకుండా కాపులను బీసీల్లో చేర్చేందుకు శాసనసభలో తీర్మానం చేశారన్నారు. బీజేపీ మైనార్టీలపై దాడులు చేస్తూ మరోపక్క రాష్ట్భ్రావృద్ధి కుంటుపడేలా చేస్తోందని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ అక్కడకు వచ్చిన కార్యకర్తలను ఉత్తేజపరిచారు. ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్‌కు ఎంపీటీసీ ఎస్‌కె రసూల్ నాగలిని బహూకరించారు. దీంతోపాటుగా స్వశక్తికరణ్ జాతీయ అవార్డు గ్రహీత అయిన అచ్చంపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సందెపోగు వెంకయ్యను సభలో పూలమాలలు, దుశ్శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమాల్లో హస్తకళల డైరెక్టర్ వట్టికూటి హర్షవర్ధన్, సంగం డెయిరీ మాజీ చైర్మన్ కిలారి రాజన్‌బాబు, ఎంపీపీ గుడేటి మార్తమ్మ, జెడ్పీటీసీ ఎన్ వెంకటేశ్వరరావు, బత్తుల శ్రీనివాసరావు, రాయిడి విశే్వశ్వరరావు, పివి రామారావు, ఆశీర్వాదం, వై నాగేశ్వరరావు, వేగుంట రాణి, బత్తుల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసాన్ని పెంచిన సుప్రీం స్పందన
గుంటూరు (పట్నంబజారు), మే 18: కర్ణాటక సంక్షోభంపై సుప్రీంకోర్టు నేడు ఇచ్చిన తీర్పు న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఉందని అవగాహన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చాగోష్ఠిలో పాల్గొన్న మేధావులు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం అరండల్‌పేటలోని అవగాహన కార్యాలయంలో కర్ణాటక సంక్షోభం - సుప్రీంకోర్టు తీర్పు అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠికి సంస్థ సీనియర్ సభ్యుడు ఎస్ కృష్ణారావు అధ్యక్షత వహించారు. విద్యావేత్త ఇ చంద్రయ్య మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్య విలువలకు భంగం కల్గించే విధంగా కర్ణాటక రాజకీయాలు దిగజారాయన్నారు. ప్రముఖ యోగాచార్యులు అచ్యుత ఇందుశేఖర్ మాట్లాడుతూ బలపరీక్ష విషయంలో అన్ని పార్టీలు అక్రమ మార్గాలనే ఎంచుకుంటున్నాయన్నారు. సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి మాట్లాడుతూ పార్టీలు ఫిరాయించే వారిని ప్రజలు ఛీకొట్టే విధంగా కార్యక్రమాలు ఉండాలన్నారు. శాసనసభకు హాజరుకాక పోయినా అమ్ముడు పోయినట్లే భావించి, ఆ శాసనసభ్యులను అనర్హులుగా పరిగణించాలన్నారు. ఈ చర్చాగోష్ఠిలో సత్యనారాయణ, కోటి నాగయ్య, వెంకటేశ్వర్లు, నాగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.