గుంటూరు

రైల్వే ట్రాక్ నిర్మాణ పనులను అడ్డుకున్న రైతులు, రైతు సంఘం నాయకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రొంపిచర్ల, మే 18: మండల పరిధిలో జరుగుతున్న నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే ట్రాక్ నిర్మాణ పనులను శుక్రవారం గ్రామ రైతులు, ఏపీ రైతు సంఘం నాయకులు, సీపీఎం పార్టీ నాయకులు అడ్డుకున్నారు. దాసరిపాలెం రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 293బీ,డీలలో 9.81ఎకరాల విస్తీర్ణంలో పనులు చేపట్టారు. రెండు సంవత్సరాల నుండి ఈ సర్వే నంబర్లలో నిర్మాణ పనులు చేపట్టలేదు. భారీ పోలీస్, రెవెన్యూ, రైల్వే శాఖ సిబ్బంది ఆ సర్వే నెంబర్లలో పనులు చేపట్టిన విషయం తెలుసుకున్న రైతులు నిర్మాణ పనులను అడ్డుకున్నారు. రొంపిచర్ల తహశీల్దార్ నాసరయ్య, రొంపిచర్ల, నకరికల్లు ఎస్‌ఐలు వెంకట్రావు, అనిల్ కుమార్‌లు రైతులకు నచ్చచెప్పినా, వారు వినిపించుకోలేదు. వెబ్ ల్యాండ్‌లో ప్రభుత్వ, పోరంబోకు భూమిగా నమోదవ్వడం వల్ల ఆ పొలాన్ని రైల్వే శాఖకు అప్పగించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. 37 సంవత్సరాలుగా ఆ పొలాన్ని సాగుచేసుకుంటున్నామని, పట్టాదారు పాస్ పుస్తకాలు తమకు ఇచ్చారని రైతులు తెలిపారు. దీంతో బ్యాంకుల నుండి పంటల రుణం కూడా తీసుకున్నామని, ఈ పొలం తప్ప తమకు ఎలాంటి జీవనాధారం లేదని, రైతులు వాపోయారు. రైల్వే ట్రాక్ నిర్మాణానికి ఇచ్చిన నష్టపరిహారం తమకూ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి వై రాధాకృష్ణ, రైతు సంఘం నాయకులు పచ్చవ రామారావు, సిపియం నాయకులు సరికొండ వేంకటేశ్వరరాజు, రామకృష్ణంరాజులు మద్దతుగా నిలిచి పనులను అడ్డుకున్నారు. ఈ పనులకు సంబంధించి కోర్టు నుండి స్టే తెచ్చుకున్నామని, ప్రభుత్వ, వాగు పోరంబోకు భూములకు నష్టపరిహారం ఇచ్చేది లేదని అధికారులు తెలిపారు. స్టే కాపీ చూపిస్తే తాము పనులను అడ్డుకోమని చెప్పడంతో అధికారులు ఆ కాపీని చూపించలేదు. దీంతో వాగ్వివాదం పెరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు లాఠీ చార్జి చేసి, విచక్షణారహితంగా కొట్టి, రైతులు, నాయకులను స్టేషన్‌కు తరలించారు. రైతులు, సంఘం నాయకులను రామిరెడ్డిపాలెం గ్రామస్థులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి పరామర్శించారు.