గుంటూరు

మెరుగైన వైద్య సేవలకు రూ. 5,800 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 21: రాష్ట్రప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలనే సంకల్పంతో 5,800 కోట్ల రూపాయలను వ్యయం చేయనుందని వైద్య, ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. స్థానిక మెడికల్ ఆసోసియేషన్ హాల్‌లో గురువారం నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో మంత్రి కామినేని విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖకు రూ. 1,500 కోట్లు కేటాయించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా రూ.1,200 కోట్లు మంజూరు చేసిందన్నారు. పలు పథకాల ద్వారా రాష్ట్రంలోని పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ముందుకు తీసుకెళ్లడంలో పాత్రికేయులు కీలకపాత్ర పోషించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అవసరమైన మందులు సరఫరా చేస్తామన్నారు. అసుపత్రుల్లో పడకల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందువల్లనే ప్రతి శాసనసభ నియోజకవర్గ పరిధిలో 30 పడకల అసుపత్రుల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా స్థాయి వరకు అన్నీ అసుపత్రులలో ప్రజలకు కావాల్సిన వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సిబ్బంది బదలీలపై త్వరలో ఒక ప్రణాళిక రూపొందించటం జరుగుతుందన్నారు. ప్రైవేటు అసుపత్రుల్లో చికిత్సలకు, శస్తచ్రికిత్సలకు వసూలు చేసే ఫీజుల వివరాలతో బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ అంశంపై డిఎంహెచ్‌ఓ అధికారులు స్పష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రసూతి కేంద్రాల వద్ద సిసి కెమెరాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల హైల్త్‌కార్డుల విషయంలో రానున్న 6 వారాల్లో తుది రూపమిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ అసుపత్రుల్లో పరిపాలనాపరమైన చర్యలు తీసుకునేందుకు రాబోయే రెండు నెలల్లో పరిపాలనాధికారులను నియమిస్తామన్నారు. వైద్యపరమైన విషయాల్లో కాకుండా పరిపాలన విషయంలో పటిష్ఠ చర్యలు తీసుకునేందుకు అధికారిని నియమిస్తున్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కామినేని డైరీని ఆవిష్కరించారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు ఎఎస్ రామకృష్ణ పాల్గొన్నారు.